IPL 2024 | ఐపీఎల్ ఫ్రాంచైజీలతో 16న బీసీసీఐ కీలక సమావేశం.. మెగా వేలంపై ప్రత్యేక చర్చ..!
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మొదలవగా.. ఇప్పటి వరకు 13 మ్యాచులు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న పది ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మొదలవగా.. ఇప్పటి వరకు 13 మ్యాచులు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న పది ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం ఈ నెల 16న అహ్మదాబాద్‌లో జరుగనున్నది. అదే రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ – గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఈ సమావేశానికి ఐపీఎల్ జట్ల యజమానులతో పాటు సీఈఓలు, ఆపరేషనల్ బృందాలను సైతం సమావేశానికి పిలిచే అవకాశం ఉందని సమాచారం.
కీలక సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ సైతం హాజరవనున్నారు. సమావేశానికి ఐపీఎల్ సీఈవో హేమాంగ్ అమిన్ ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మెగా వేలానికి ముందే పాలసీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ఫ్రాంచైజీలకు పంపిన ఆహ్వానంలో ఎజెండాను మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. హఠాత్తుగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. వచ్చే ఏడాది జరుగనున్న మెగా వేలం జరుగనున్నది. ఇందుకు సంబంధించి బీసీసీఐ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై సైతం చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వేలానికి ముందు ఆటగాళ్ల రిటైన్‌పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రిటైన్ విషయంలో జట్ల యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రిటైన్ చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్యపై ఏకాభిప్రాయం లేదు. ప్రస్తుతం ఈ విషయంలో వేలానికి ఓ ముందే నిర్ణయానికి రావాలని బీసీసీఐ భావిస్తున్నది. కొన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతున్నారు. కొన్ని ఫ్రాంచైజీలు ఈ సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతున్నాయి. అయితే, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అలాగే దాంతో పాటు సాలరీ క్యాప్‌పై చర్చించే అవకాశాలున్నాయి. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.100 కోట్లు పరిమితి కాగా.. ఈ సారి పెరుగుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

