IPL Brand Value: అందనంత ఎత్తున ఐపీఎల్.. బ్రాండ్ వాల్యూలో మరో మైలురాయి
IPL Brand Value: 2008లో మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిన ఐపీఎల్.. బ్రాండ్ వాల్యూ విషయంలో మరో కీలక మైలురాయిని దాటింది.
IPL Brand Value: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బంగారు బాతులా దొరికిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతున్నది. 2008లో మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిన ఐపీఎల్.. బ్రాండ్ వాల్యూ విషయంలో మరో కీలక మైలురాయిని దాటింది. 16 సీజన్లు ముగిసి 17వ సీజన్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈ మెగా లీగ్ బ్రాండ్ వాల్యూ ‘డెకాకార్న్’ స్టేటస్‌ను దాటింది. ఒక సంస్థ విలువ పది బిలియన్ డాలర్లు దాటితే దానిని డెకాకార్న్ అని పేర్కొంటారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసే నాటికి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 10.7 యూఎస్ బిలియన్ డాలర్లుగా ఉందని ప్రముఖ బ్రాండ్ వాల్యూయేషన్ కన్సల్టెన్సీ ‘బ్రాండ్ ఫైనాన్స్’ ఒక నివేదికలో వెల్లడించింది. అంటే ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 89,236 కోట్లు.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఈ ఏడాదితో పోల్చితే ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా 433 శాతం పెరిగింది. గతేడాది ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా రూ. 48,390 కోట్ల ఆదాయం ఆర్జించడం ద్వారా ఐపీఎల్ వాల్యూ ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. 2018, 2019లలో ఐపీఎల్ బ్రాండ్ విలువ వరుసగా 5.3 యూఎస్ బిలియన్ డాలర్లు, 5.7 యూఎస్ బిలియన్ డాలర్లుగా ఉండేది. కరోనా కారణంగా ఐపీఎల్ ఆదాయం భారీగా పడిపోయింది. 2020, 2021లలో ఇది 4.4 యూఎస్ బిలియన్ డాలర్లు, 4.7 యూఎస్ బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ 2022లో ఐపీఎల్‌లోకి గుజరాత్ జెయింట్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ఎంట్రీతో పాటు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆదాయం రెట్టింపయ్యింది. దానికి తోడు మీడియా హక్కుల వేలం ద్వారా ఆదాయం కలిసిరావడంతో ఈ లీగ్ విలువ డెకాకార్న్ దాటింది.
ఫ్రాంచైజీల పరంగా ముంబై టాప్..
ఫ్రాంచైజీల పరంగా చూస్తే ఐదు సార్లు ట్రోఫీ విజేత ముంబై ఇండియన్స్ 87 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ. 725 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 675 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 657 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 582 కోట్లు)లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌లు తదుపరి స్థానాల్లో నిలిచాయి. కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐపీఎల్ బ్రాండ్‌గా ఉంది.
IPL teams brand value.
(via TOI)
Mumbai Indians – 725cr.
Chennai super kings – 675cr.
Kolkata knight riders – 657cr.
Royal challengers Bengaluru – 582cr.📸: BCCI pic.twitter.com/lK717da5Js
— Cricket Empire (@CEmpire_7) December 13, 2023
అదొక్కటే మనకంటే ముందు..
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు పోటీ అని చెప్పుకుంటున్న క్రికెట్ లీగ్‌లలో ఏ ఒక్కటి కూడా ఈ లీగ్ దరిదాపుల్లో కూడా లేదు. విలువపంగా అమెరికాలో జరిగే నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) తర్వాత రెండో స్థానంలో ఉన్న లీగ్ ఐపీఎల్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ), మేజర్ లీగ్ బేస్‌బాల్ (ఎంఎల్‌బీ), లా లిగా, బుండెస్లిగాలు కూడా ఐపీఎల్ తర్వాతి స్థానాల్లోనే ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

