Shane Watson | రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ వ్యూహంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్లో ఎందుకు బ్యాటింగ్ వస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. శుక్రవారం చెపాక్ స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 50 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. షేన్ వాట్సాన్ మాట్లాడుతూ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను ధోనీ కంటే ముందు పంపారని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ధోనీ కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. చివరి వరకు సీఎస్కే ఓటమి నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చాలా ఆలస్యమైంది. ధోనీ క్రీజులోకి వచ్చే ముందే దాదాపుగా మ్యాచ్ చివరకు చేరింది.
వాట్సాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్కే అభిమానులు చూసిందే కేవలం ధోనీ బ్యాటింగ్ మాత్రమేనని తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో రావాలని.. అలా చూసేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు. అశ్విన్ కన్నా ముందే ధోనీ బ్యాటింగ్‌కు వచ్చి ఉండాల్సిందని.. ఆట పరిస్థితిని బట్టి కనీసం 15 బంతులు అదనంగా ఆడేవాడని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా తాను ఇంకా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలనని నిలకడ చూపించాడని.. అతన్ని టాప్ ఆర్డర్లో చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. గత ఎడిషన్‌లో ధోని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడని.. ఆర్సీబీతో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కుప్పకూలిందని.. రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపడం తదితర నిర్ణయాలపై నిరాశ వ్యక్తం చేశాడు. గైక్వాడ్ గొప్ప ఓపెనర్ అయినప్పటికీ తర్వాత బ్యాటింగ్‌కు రావాల్సిందని అభిప్రాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ మైదానంలో స్ట్రయిక్ రొటేట్ చేస్తాడని.. అతని షాట్లు చూస్తే ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపించిందని.. దీపక్ హుడా సైతం ప్రస్తుతానికి ఆడేందుక సిద్ధంగా లేడని.. ప్రతి బంతిని తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లుగా ఆడాడని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ్ పేర్కొన్నాడు.
సామ్ కర్రన్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయించడం తప్పుడు నిర్ణయమని.. తాను మాత్రం నెంబర్ సెవెన్ బ్యాటర్‌గా చూస్తున్నానని.. ప్రస్తుతం జట్టు కాంబినేషన్ సరిగా లేదని.. తప్పనిసరిగా కొన్ని మార్పులు చేయాల్పిందేనని అభిప్రాయపడ్డాడు. ఇదే బ్యాటింగ్ ఆర్డర్‌ను కొనసాగితే ఇబ్బందిగా మారుతుందని తెలిపాడు. ఇక వాట్సాన్ ధోనీ వికెట్ కీపింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. గతంలో తరహాలోనే ఇప్పటికీ వికెట్ల వెనుక చురుగ్గా ఉన్నాడని చెప్పాడు. ఆకాశ్ చొప్రా సైతం ధోనీ అభినందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీని ముందుగా పంపి ఉంటే గెలిచే అవకాశం ఎక్కువగా ఉండేదని.. అభిమానులు చిన్న ఇన్నింగ్స్‌ను మాత్రమే చూశారని తెలిపాడు. ధోనీ వికెట్ కీపింగ్ అద్భుతమని చెప్పాడు. ప్రపంచంలో ఖచ్చితత్వంతో స్టంపింగ్‌లు చేయగల ఒకే ఒక ఆటగాడు ధోనీ మాత్రమేనని పొగడ్తలతో ముంచెత్తాడు.