LSG vs PBKS | ఈ సీజన్లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఆశపడుతున్న లఖ్‌నవూ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరో ఓవర్లోపే రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది. నాలుగో ఓవర్లో కేఎల్ రాహుల్, ఆరో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ ఔటయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్‌నవూ.. దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ చెలరేగి ఆడారు. కానీ 4వ ఓవర్లో అర్ష్‌దీప్ వేసిన బంతికి కేఎల్ రాహుల్ క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు మూడో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ఔట్ కావాల్సింది. రబాడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ హర్షల్ క్యాచ్ మిస్ చేయడంతో అప్పుడు బతికిపోయాడు. కానీ నాలుగో ఓవర్లో బెయిర్‌స్టోకు చిక్కాడు. ఇక ఆరో ఓవర్లో మొదటి బంతికే డికాక్ ఔటయ్యాడు. సామ్ కరణ్ వేసిన ఓవర్లో శిఖర్ ధవన్‌కు క్యాచ్ ఇచ్చాడు.