Sunrisers Hyderabad | ఐపీఎల్-2023 సీజన్లో.. కొత్త జెర్సీతో బరిలో సన్ రైజర్స్ హైదరాబాద్..!
Sunrisers Hyderabad | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్ కోసం జన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నది. రాబోయే సీజన్‌కు సంబంధించి జెర్సీని ఆవిష్కరించింది. మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ కొత్త జెర్సీతో ఉన్న వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.
Sunrisers Hyderabad | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్ కోసం జన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నది. రాబోయే సీజన్‌కు సంబంధించి జెర్సీని ఆవిష్కరించింది. మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ కొత్త జెర్సీతో ఉన్న వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. పాత ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో సమూలమైన మార్పులు చేయకుండా..సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలినట్టుగా ఆరెంజ్ జెర్సీపై నల్లరంగును అద్దింది. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2023 సీజన్లో తన తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు విజయాలు, ఎనిమిది ఓటములతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.
కొత్త కెప్టెన్‌గా ఐడెన్ మార్క్రమ్
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్కు బాధ్యతలు అప్పగించింది. సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ అందించాడు. 2022లో సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. ఈ సీజన్లో 13 ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ 216 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన వేలంలో మయాంక్ అగర్వాల్‌తో పాటు పలువురు ఆటగాళ్లను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసింది. మరి సీజన్లోనైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్) హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెరిచ్ క్లాసిన్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వివ్రాంత్ శర్మ, అదిల్ రషీద్, మయాంక్ దగర్, అకీల్ హుస్సేన్, మయాంక్ మర్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, అన్మోల్ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

