IPL 2022 | ఫామ్‌లో ఉన్న డివిలియర్స్లా ఆడాడు.. యువ ప్లేయర్‌పై మాజీ దిగ్గజం ప్రశంసలు
ప్రపంచ క్రికెట్లో సౌతాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ గురించి తెలియని వారుండరు. ‘మిస్టర్ 360 డిగ్రీస్’ అని అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. ఎలాంటి క్లిష్ట తరమైన స్టేజ్ నుంచి అయినా జట్టును గెలిపించగల సమర్ధుడు. అచ్చం అలాగే బ్యాటింగ్ చేశాడంటూ భారత యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అయిన రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
79 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును సూర్య ఆదుకున్నాడు. ఆరు సిక్సర్ల సాయంతో 41 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రవిశాస్త్రి..
‘‘అతను ఆడిన షాట్లు, మణికట్టు వాడుకున్న విధానం, ఫీల్డింగ్‌లో గ్యాప్‌లు వెతికిన తీరు.. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఏబీ డివిలియర్స్ అలాగే ఆడేవాడు. అలాంటి ఆటగాళ్లు దొరకడం చాలా అరుదు. ప్రస్తుతం డివిలియర్స్ తర్వాత.. బట్లర్, సూర్య మాత్రమే ఉన్నారు. అలాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్ల జాబితాలో సూర్య కూడా ఉంటాడు’’ అని మెచ్చుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

