నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై.. కోల్‌కతాపై 27 పరుగుల తేడాతో గెలుపు

IPL 2021 | CKS vs KKR | ఐపీఎల్-14లో చెన్నై సూపర్‌కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే ఓపెనర్లు డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32) శుభారంభం చేశారు. గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప (31) ఫర్వాలేదనిపించాడు. గైక్వాడ్, ఉతప్ప ఔటైనప్పటికీ డుప్లెసిస్ చెలరేగి ఆడాడు. ఫాస్ట్‌గా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఉతప్ప తర్వాత వచ్చిన మొయిన్ అలీ (37) కూడా దూకుడుగా ఆడాడు. దీంతో చెన్నై భారీ స్కోర్‌ను సాధించింది. కానీ ఇన్నింగ్స్ చివరి బంతికి డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి చెన్నై 192 పరుగులు చేసింది.
193 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన కోల్‌కతా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50 ), శుభ్‌మన్ గిల్ (51) ధాటిగా ఆడారు. చెరో హాఫ్ సెంచరీతో మెరిశారు. కానీ వెంకటేశ్ అయ్యర్ ఔటయ్యాక కోల్‌కతాకు వరుస షాకులు తగిలాయి. వరుసగా నితీశ్ రాణా డకౌట్ అవ్వగా.. సునీల్ నరైన్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. కోల్‌కతా ఆటగాళ్లు చతికిలపడ్డారు. దినేశ్ కార్తిక్ (9), షకీబ్ (0), రాహుల్ త్రిపాఠి (2), మోర్గాన్ (4) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి పరుగులు మాత్రమే చేసి.. టార్గెట్‌ను చేధించడంలో విఫలమైంది. దీంతో ఐపీఎల్ 2021 ఛాంపియన్‌గా నిలిచింది. నాలుగోసారి కప్ గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- csk vs kkr
- ipl
- IPL 2021
- KKR vs CSK
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

