మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ మెడలా.. మజాకా.. ఈ మెగా స్పోర్టింగ్ ఈవెంట్లో ఒక్క మెడల్ గెలిచినా ఆ అథ్లెట్ జీవితమే మారిపోతుంది. తాజాగా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుయే దీనికి నిదర్శనం. ఒలింపిక్స్‌లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించి పెట్టిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై బహుమతుల వర్షం కురుస్తూనే ఉంది. రైల్వే శాఖ 2 కోట్లు, మణిపూర్ ప్రభుత్వం కోటి క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించాయి. ఇక ఆ మధ్య తనకు పిజ్జా అంటే ఇష్టమని ఆమె చెప్పగానే.. నీకు లైఫ్‌టైమ్ ఫ్రీగా పిజ్జాలు ఇస్తామని డొమినోస్ ప్రకటించిన విషయం తెలుసు కదా.
తాజాగా ఓ మల్టీప్లెక్స్ చెయిన్ మీరాబాయికి జీవితకాలం ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తామని ప్రకటించింది. ఆమె ఎన్ని సినిమాలు చూసినా అన్నీ ఫ్రీ అంటూ చెప్పింది ఐనాక్స్ లీజర్ లిమిటెడ్. మీరాబాయికే కాదు.. ఈ ఒలింపిక్స్‌లో మెడల్‌తో ఇంటికి వచ్చే ప్రతి భారత అథ్లెట్‌కు ఇదే ఆఫర్ వర్తిస్తుందని ఐనాక్స్ స్పష్టం చేసింది. ఇక ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ప్రతి అథ్లెట్‌కు ఏడాదిపాటు ఫ్రీగా టికెట్లు ఇస్తామనీ చెప్పడం విశేషం. దేశంలో ఐనాక్స్కు మొత్తం 648 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ఈ విషయాన్ని తన ట్విటర్లో ఐనాక్స్ తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

