INDWvsENGW: ఇంగ్లండ్‌కు కళ్లెం వేసిన స్పిన్నర్లు.. ఇండియా ముందు ఈజీ టార్గెట్
INDWvsENGW: భారత స్పిన్నర్లు సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్‌లు ఇంగ్లండ్‌కు స్పిన్ ఉచ్చులో బంధించారు. 24 గంటలు కాకముందే తమను దెబ్బకొట్టిన ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకునే బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
INDWvsENGW: వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు మూడో టీ20లో మాత్రం రాణించింది. భారత స్పిన్నర్లు సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్‌లు ఇంగ్లండ్‌కు స్పిన్ ఉచ్చులో బంధించారు. 24 గంటలు కాకముందే తమను దెబ్బకొట్టిన ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకునే బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను 126 పరుగులకే పరిమితం చేశారు. ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ (42 బంతుల్లో 52, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఆరంభ ఓవర్లలో భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ బెంబేలెత్తించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బౌచర్‌ను పరుగుల ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపిన రేణుకా.. తానే వేసిన మూడో ఓవర్లో మరో ఓపెనర్ సోఫియా డంక్లీ (11)ని ఔట్ చేసింది. మూడు ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. ఆరో ఓవర్ వేసిన సైకా ఇషాక్.. అలీస్ క్యాప్సీ (7)ని ఔట్ చేయడంతో ఇంగ్లండ్.. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్, వికెట్ కీపర్ అమీ జోన్స్ (21 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్)లు ఆ జట్టును ఆదుకున్నారు. ఇరువురూ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జతచేశారు. ఈ జోడీని ఇషాక్ విడదీసింది. ఆమె వేసిన 12వ ఓవర్లో జోన్స్.. భారీ షాట్ ఆడబోయి శ్రేయాంకకు క్యాచ్ ఇచ్చింది. మరుసటి బంతికే గిబ్సన్ క్లీన్ బౌల్డ్ అయింది. ఇదే ఊపులో శ్రేయాంక.. 13వ ఓవర్లో ఫ్రెయా కెంప్ ను పెవిలియన్‌కు పంపింది. ఎకిల్‌స్టోన్ (2) ను కూడా 15వ ఓవర్ మూడో బంతికి బౌల్డ్ చేసింది. 12వ ఓవర్‌కు ముందు 66-3గా ఉన్న ఇంగ్లండ్.. తర్వాత 3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది.
Shreyanka Patil – the future star of 🇮🇳India #CricketTwitter #INDvENG pic.twitter.com/91SYF0S15c
— Female Cricket (@imfemalecricket) December 10, 2023
వరుసగా వికెట్లు కోల్పోయినా ఆఖర్లో చార్లెట్ డీన్ (15 నాటౌట్) సాయంతో కెప్టెన్ నైట్ ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించింది. అమన్‌జ్యోత్ కౌర్ వేసిన చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది ఆ జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించింది. ఆఖరి ఓవర్లో అమన్‌జ్యోత్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ను ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

