న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ప్లేయర్ సుమిత్ అంటిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రపంచ రికార్డుతో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
గురువారం జరిగిన పురుషుల ఎఫ్64 జావెలిన్ త్రో విభాగంలో బరిలోకి దిగిన సుమిత్ జావెలిన్‌ను 70.83మీటర్ల దూరం విసిరి ఇది వరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (70.17మీ)ను తుడిచిపెట్టాడు. దీని ద్వారా వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు సుమిత్ అర్హత సాధించాడు.