Kiran George | థాయ్‌లాండ్ ఓపెన్‌లో సంచలనం.. వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత కుర్రాడు
Kiran George : థాయ్‌లాండ్ ఓపెన్(Thailand Open 2023)లో భారత కుర్రాడు కిరణ్ జార్జ్ సంచలనం సృష్టించాడు. తనకంటే మెరుగైన ర్యాంకర్ అయిన వరల్డ్ చాంపియన్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 59వ ర్యాంకర్ కిరణ్ 32వ రౌండ్లో 9వ ర్యాంకర్ షి యకీ(చైనా)పై గెలుపొందాడు. 22 ఏళ్ల కిరణ్ ప్రీ - క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
Kiran George : థాయ్‌లాండ్ ఓపెన్(Thailand Open 2023)లో భారత కుర్రాడు కిరణ్ జార్జ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో తనకంటే మెరుగైన ర్యాంకర్ అయిన వరల్డ్ ఛాంపియన్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 59వ ర్యాంకర్ కిరణ్ 32వ రౌండ్లో 9వ ర్యాంకర్ షి యకీ(చైనా)పై గెలుపొందాడు. 22 ఏళ్ల కిరణ్ ఆట మొదలైనప్పటి నుంచి ఆధిపత్యం చెలాయించాడు. వరుస సెట్లలో 21-18, 22-20తో యకీని చిత్తు చేశాడు. దాంతో, ప్రీ – క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
‘ఒడిషా ఓపెన్ 100 టోర్నమెంట్ నుంచి కిరణ్ జార్జ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే… అతను ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. గత నాలుగు, ఐదు నెలల నుంచి అతడి ఆత్మవిశ్వాసంతో లేడు. అలాంటిది థాయ్‌లాండ్ ఓపెన్‌లో కిరణ్ అనూహ్యంగా పుంజుకున్నాడు’ అని కిరణ్ కోచ్ సాగర్ చొప్డా(Sagar Chopda) తెలిపాడు. యుకీ 2018 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు.
శ్రీకాంత్ ఔట్
భారత్‌కు చెందిన అష్మిత చలిహ(Ashmita Chaliha) కూడా సత్తా చాటింది. మాలవికా బన్సోద్‌పై గెలిచి 16వ రౌండ్‌కు చేరింది. మలేషియా మాస్టర్స్ ఓపెన్ క్వార్టర్స్‌లో వైదొలిగిన తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఈ టోర్నీలోనై నిరాశ పరిచాడు. అవును.. అతడి పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో అతను ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్ విజేత పీవీ సింధు ఈరోజు తొలి మ్యాచ్ ఆడనుంది. కెనడాకు చెందిన మిచెల్లే లితో ఆమె తలపడనుంది. మలేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన హెచ్ ఎస్ ప్రణయ్ 26వ ర్యాంకర్ వాంగ్ జూ వే(చైనా)ను ఢీ కొట్టనున్నాడు.
ఇవి కూడా చదవండి
Anil Kumble | 2019 వరల్డ్ కప్‌లో రాయుడిని ఆడించకపోవడం పెద్ద పొరపాటు: అనిల్ కుంబ్లే
IPL 2023 | ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే విజయం.. అభిమానుల సంబరాలు చూశారా.. వీడియోలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

