Anil Kumble | 2019 వరల్డ్ కప్‌లో రాయుడిని ఆడించకపోవడం పెద్ద పొరపాటు: అనిల్ కుంబ్లే
Anil Kumble : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu ) మూడు రోజుల క్రితం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున ఆడిన అతను చాంపియన్‌గా కెరీర్ ముగించాడు. 2019 వరల్డ్ కప్‌లో అంబటి రాయుడిని ఆడించకపోవడం పెద్ద పొరపాటని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే(Anil Kumble) అన్నాడు.
Anil Kumble : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) మూడు రోజుల క్రితం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున ఆడిన అతను చాంపియన్‌గా కెరీర్ ముగించాడు. పవర్ హిట్టర్ అయిన రాయుడు 2019 వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గు రయ్యాడు. రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం.. మాజీ కోచ్ అనిల్ కుంబ్లే(Anil Kumble) అతడిపై సంచలన వ్యాఖ్యాలు చేశాడు. 2019 వరల్డ్ కప్‌లో అంబటి రాయుడిని ఆడించకపోవడం పెద్ద పొరపాటని అతను అన్నాడు.
‘రాయుడిని సెలెక్ట్ చేయకపోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే.. వరల్డ్ కప్ కోసం అతడిని చాలా రోజులుగా సన్నద్ధం చేశారు. కానీ, తీరా టోర్నీ సమయానికి తుది జట్టులో అతడికి చోటు కల్పించలేదు’ అని కుంబ్లే తెలిపాడు. రాయుడు స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎంపిక చేశారు. శంకర్ త్రీడీ(3 Dimensional) ప్లేయర్‌గా పనికొస్తాడని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కే. ప్రసాద్(MSK Prasad) చెప్పడం గమనార్హం.
విజయ్ శంకర్, అంబటి రాయుడు

అయితే.. ప్రసాద్ వ్యాఖ్యలపై రాయుడు సోషల్ మీడియా వేదికగా సీరియస్‌గానే స్పందించాడు. త్రీడీ కళ్లద్దాలు కొని పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు శంకర్ ఏమంత రాణించకపోవడంతో సెలెక్టర్లపై అందరూ విమర్శలు గుప్పించారు. టైటిల్ ఫేవరెట్ అయిన భారత జట్టు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఒక సెంచరీ, 22 అర్ద శతకాలు
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు రాయుడు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 204 మ్యాచ్‌లు ఆడాడు. అతడి ఖాతాలో 1 సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిడిలార్డర్లో దంచి కొట్టే ఈ కుడి చేతివాటం బ్యాటర్ 4,332 రన్స్ చేశాడు. 16వ సీజన్ ఫైనల్లోనూ అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లోనే 1 ఫోర్, రెండు సిక్స్‌లతో 19 పరుగులు చేసి చెన్నై కప్పు కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి
IPL 2023 | ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే విజయం.. అభిమానుల సంబరాలు చూశారా.. వీడియోలు
Sarandeep Singh | వికెట్ కీపర్‌గా భరత్ సరైనోడు.. టెస్టు చాంపియన్‌షిప్‌లో అతడినే ఆడించాలి : మాజీ సెలెక్టర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

