Home
Sports
Indias Aishwary Pratap Singh Tomar Smashes Junior World Record To Win Gold At Shooting World Championships
ప్రతాప్ రికార్డు స్వర్ణం

- షూటింగ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్
లిమా: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్‌సింగ్ తోమర్ ప్రపంచ రికార్డును సమం చేస్తూ స్వర్ణం కొల్లగొట్టాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ప్రతాప్‌సింగ్.. సత్తా చాటి 1185 పాయింట్లతో జూనియర్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. తుది పోరులో ప్రతాప్ 463.4 పాయింట్లు సాధించి పసిడి పతకం గెలుపొందగా.. లుకాస్ క్రిజ్ (456.5 పాయింట్లు, ఫ్రాన్స్), గెవిన్ బార్నిక్ (446.6 పాయింట్లు, అమెరికా) వరుసగా రజత, కాంస్యాలు చేజిక్కించుకున్నారు. ఇదే విభాగంలో భారత షూటర్లు సంస్కార్ (1160), పంకజ్ ముఖేజా (1157), సర్తాజ్ తివానా (1157) వరుసగా 11, 15, 16 స్థానాల్లో నిలిచారు. ఇక ఇదే టోర్నీలో 14 ఏండ్ల నామ్య కపూర్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

