టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అమెరికా టాప్‌సీడ్ ప్లేయర్ ఫాబియానో కరువానను భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ అద్భుతంగా నిలువరించాడు. సోమవారం జరిగిన పురుషుల నాలుగో రౌండ్లో ఫాబియానోతో గేమ్‌ను గుకేశ్ డ్రా చేసుకున్నాడు.
ఈ ఇద్దరి మధ్య ఆఖరి వరకు ఆసక్తికరమైన పోరు జరిగింది. విదిత్ గుజరాతి..ఇయాన్ తిలో ఓడగా, నకామురతో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. మహిళల విభాగంలో వైశాలి..అలెగ్జాండ్రతో గేమ్‌తో డ్రా చేసుకుంది.