న్యూఢిల్లీ: భారత యువ ఆర్చర్ పార్థ్ సోలాంకి యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీ రికర్వ్ విభాగంలో సోమవారం పార్థ్ పసిడి పతకం కొల్లగొట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మహారాష్ట్రకు చెందిన 19 ఏండ్ల పార్థ్ అండర్-21 పురుషుల రికర్వ్ ఫైనల్లో 7-3 తో సాంగ్ ఇంజున్పై విజయం సాధించాడు. మరోవైపు మహిళల అండర్-21 రికర్వ్ విభాగంలో భాజా కౌర్ కాంస్యం పతకంతో మెరిసింది. దీంతో ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రికార్డు స్థాయిలో 11 పతకాలతో ముగించింది.