Tokyo Olympics: వుమెన్స్ హాకీలో ఓడిన భారత్.. చేజారిన కాంస్యం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics) లో భారత మహిళల హాకీ జట్టు .. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌ను ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో బ్రిటన్ 4-3 గోల్స్ తేడాతో పతకాన్ని సొంతం చేసుకున్నది. తుద వరకు ఇండియన్ వుమెన్ పోరాడినా.. ఫోర్త్ క్వార్టర్స్‌లో చేతులెత్తేశారు. దీంతో ఒలింపిక్స్ హాకీలో చరిత్ర సృష్టించే అద్భుత అవకాశాన్ని మహిళల జట్టు మిస్సైంది. నిజానికి టీమిండియా వుమెన్ స్పూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. సవితా పూనియా అద్భుతమైన రీతిలో గోల్ పోస్టు వద్ద బ్రిటన్ దూకుడును అడ్డుకున్నది. ఇక సెకండ్ క్వార్టర్లో గోల్స్ వర్షం కురిసింది. బ్రిటన్ రెండు గోల్స్ చేయగా.. ఇండియన్ వుమెన్ మూడు గోల్స్ చేశారు. గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మరో ప్లేయర్ వందనా కటారియా తన డ్రాగ్ ఫ్లిక్‌తో మరో గోల్‌ను ఇండియాకు అందించింది. దీంతో రెండవ క్వార్టర్లో ఇండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక మూడవ క్వార్టర్ కూడా ఆసక్తికరంగా సాగింది. గోల్ పోస్టును టార్గెట్ చేస్తూ దూకుడు ప్రదర్శించిన బ్రిటన్ అమ్మాయిలు.. ఆ క్వార్టర్లో ఒక గోల్ చేశారు. దీంతో రెండు జట్లు 3-3 గోల్స్‌తో సమంగా నిలిచాయి. టెన్షన్‌గా మారిన నాలుగవ క్వార్టర్లో.. బ్రిటన్ వుమెన్ తమ జోరును ప్రదర్శించారు. 48వ నిమిషంలో గ్రేస్ బల్సడన్ గోల్ చేయడంతో బ్రిటన్‌కు ఆధిక్యం దక్కింది. చివరి క్వార్టర్లో భారత మహిళలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

