IBSA World Games | అంధుల క్రికెట్ చాంప్ భారత్.. సత్తాచాటిన తెలంగాణ క్రికెటర్లు
అంధులైతేనేం..ఈ ప్రపంచాన్ని తమ మనోనేత్రంతో జయించారు. అంగవైకల్యం ప్రతిబంధకమైనా..తాము ప్రతిభలో ఎవరికి తీసిపోమని ఘనంగా చాటిచెప్పారు. ప్రోత్సహిస్తే చాలు పతకాలతో దేశ కీర్తి, ప్రతిష్టల మరింత ఇనుమడింపజేస్తామని చేతల్లో చూపించారు. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది.
- ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం
IBSA World Games | బర్మింగ్‌హామ్: అంధులైతేనేం..ఈ ప్రపంచాన్ని తమ మనోనేత్రంతో జయించారు. అంగవైకల్యం ప్రతిబంధకమైనా..తాము ప్రతిభలో ఎవరికి తీసిపోమని ఘనంగా చాటిచెప్పారు. ప్రోత్సహిస్తే చాలు పతకాలతో దేశ కీర్తి, ప్రతిష్టల మరింత ఇనుమడింపజేస్తామని చేతల్లో చూపించారు. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఐబీఎస్ఏ (ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) వరల్డ్గేమ్స్లో భాగంగా శనివారం జరిగిన మహిళల ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయం మధ్య సాగిన మ్యాచ్‌లో తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 114 పరుగులకు పరిమితమైంది. వర్షం కారణంగా నిర్దేశిత లక్ష్యఛేదనలో ఒక వికెట్ కోల్పోయి భారత్ విజయాన్నందుకుంది. ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టు తరఫున మన రాష్ట్రం నుంచి సంధ్య, సత్యవతి, రవన్ని బరిలో దిగారు.
వీరు ప్రముఖ
ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామికి చెందిన నేత్రవిద్యాలయ విద్యార్థులు కావడం విశే షం. వైకల్యం అడ్డంకిగా మారినా మెండైన ఆత్మవిశ్వాసంతో యావత్తు దేశం గర్వపడేలా తమదైన ప్రతిభతో వీరు ఆకట్టుకున్నారు. తొలిసారి జరిగిన మహిళల క్రికెట్లో సత్తాచాటుతూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ అప్రతిహత విజయాల్లో వీళ్లు కీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ గడ్డపై చరిత్ర లిఖించిన సంధ్య, సత్యవతి, రవన్నికి చినజీయర్‌స్వామి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. దీనికి తోడు మిగతా భారత క్రికెటర్లకు రెండు లక్షల పారితోషకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆహారం విషయంలో ఇంగ్లండ్‌లో ఇబ్బందులు పడ్డ ఈ క్రికెటర్లకు వీటీ సేవ అద్భుత సేవలు అందించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

