Mirabai Chanu : భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను(Mirabai Chanu) మరోసారి తన భుజ బలం చూపించింది. ఆసియా క్రీడల్లో కొద్దిలో పతకం చేజార్చుకున్న ఆమె ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో మీరా అదరగొట్టింది. గ్రూప్ బి 49 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన మీరా.. విశ్వ క్రీడలకు అర్హత సాధించింది.
నిరుడు తొడ కండరాల గాయం కారణంగా మీరా ఆరు నెలలు ఆటకు దూరమైంది. ఈమధ్యే కోలుకున్న ఆమె థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్‌లో బరిలోకి దిగింది. మొత్తంగా రెండు ప్రయత్నాల్లో మీరా 184 కిలోల(81 కిలోలు, 103 కిలోలు) బరువు ఎత్తింది. దాంతో, ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్న భారత తొలి వెయిట్‌లిఫ్టర్‌గా మీరా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరా వెండి పతకంతో మెరిసిన విషయం తెలిసింది.