టాలస్కల(మెక్సికో): ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత స్టార్ ప్లేయర్ దీపికా కుమారి రజత పతకంతో మెరిసింది. మూడేండ్ల తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో పోటీకి దిగిన దీపిక అద్భుత ప్రదర్శన కనబరిచింది. సోమవారం జరిగిన మహిళల రికర్వ్ ఫైనల్లో దీపిక 0-6తో లీ జియామన్(చైనా) చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. రెండో సీడ్‌గా పోటీకి దిగిన దీపికకు ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో ఇది ఐదో రజత పతకం కావడం విశేషం.
మరోవైపు పురుషుల రికర్వ్ విభాగంలో యువ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆదిలో దూకుడు కనబరిచినా 4-6 తేడాతో కొరియా ఆర్చర్ లీ వూ సీయోక్ చేతిలో ఓడి నిష్క్రమించాడు. దీంతో ఐదుగురు ఆర్చర్లతో బరిలోకి దిగిన భారత్..ఒక్క పతకంతో తమ పోరాటాన్ని ముగించింది.