HDFC BANK | ఎల్పీజీ ధరల నుంచి బ్యాంకు డిపాజిట్ రూల్స్ వరకు.. జూన్‌లో రాబోతున్న కీలక మార్పులివే
HDFC BANK : సాధారణంగా ఒకటో తేదీ నుంచి కీలక మార్పుల్ని అమలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరం. మరి జూన్ 1 నుంచి దేశంలో రాబోతున్న కీలక మార్పులివే.
HDFC BANK : దేశంలో ప్రతి నెల ఆర్థిక అంశాలు, ప్రభుత్వ పాలసీలు వంటివి మారుతుంటాయి. సాధారణంగా ఒకటో తేదీ నుంచి కీలక మార్పుల్ని అమలు చేస్తుంటారు. మరో రెండు రోజుల్లో జూన్లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరం. మరి జూన్ 1 నుంచి దేశంలో రాబోతున్న కీలక మార్పులివే. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం.. చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరల్ని నిర్ణయిస్తుంటాయి. ధరలు పెంచినా, తగ్గించినా ఒకటో తేదీనే ప్రకటిస్తారు.
అయితే, అంతర్జాతీయ పరిణామాల్ని బట్టి నెల మధ్యలో కూడా ధరలు మారుతుంటాయి. వాణిజ్య సిలిండర్ల ధరలు, గృహ వినియోగ సిలిండర్ల ధరలు జూన్ 1న ప్రకటిస్తారు. సిలిండర్ ధరలతోపాటు విమానాలు, హెలికాప్టర్లలో వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరల్ని కూడా ప్రతి నెలా నిర్ణయిస్తారు. జూన్ 1నే ఈ ధరల్ని కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా అటు గ్యాస్ ధరలు, ఇటు ఏటీఎఫ్ ధరలు ప్రస్తుతం ఎక్కువగానే ఉన్నాయి. ఏటీఎఫ్ ధరలు పెరిగితే విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఒక కిలోలీటర్ ధర రూ.104,927గా ఉంది.
క్యాష్ డిపాజిట్లపై రూల్స్‌ను, కొన్ని అకౌంట్ల నిర్వహణ రూల్స్‌ను హెచ్డీఎఫ్సీ జూన్ 1వ తేదీ నుంచి మార్చబోతుంది. చిన్న నోట్లు, నాణేల డిపాజిట్ల విషయంలో కొత్త రూల్స్ తీసుకురాబోతుది. ఈ విషయంలో లిమిట్ విధించే అవకాశంతోపాటు అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఇప్పటివరకు డిపాజిట్లపై ఎలాంటి పరిమితి లేదు. నోట్ల డిపాజిట్ల మీద 4 శాతం, కాయిన్ డిపాజిట్ల మీద 5 శాతం ఛార్జీలు విధించే అవకాశం ఉంది. తాజా నిబంధనల ప్రకారం రూ.20ల నోట్లు డిపాజిట్ చేయాలంటే ఆ మొత్తం రూ.10,000 దాటకూడదు. అలాగే, కాయిన్స్ డిపాజిట్ చేయాలంటే రూ.5,000 దాటకూడదు. ఈ లిమిట్ దాటితే అదనంగా 2 శాతం ఛార్జీలు విధిస్తారు.
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కూడా జూన్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇక నుంచి ప్రభుత్వ పథకాల ద్వారా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఆమోదించి, గుర్తించిన సోలార్ మాడ్యూల్స్, సెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. నాణ్యమైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఈ నిర్ణయం వల్ల సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. జూన్ నెలలో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు ఉండే అవకాశం ఉంది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కాకుండా జూన్ 15, 25, 26, 29, 30న బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
వీటిలో మొహర్రం, సంత్ గురు కబీర్ జయంతివి కూడా ఉంటాయి. అలాగే, తెలంగాణకు సంబంధించి జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం వంటి వాటికి కూడా సెలవులు ఉంటాయి. ప్రాంతీయంగా స్థానిక పండుగలను దృష్టిలో ఉంచుకుని కూడా సెలవులు వర్తిస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

