Asian Athletics Championships | వరుసగా రెండో స్వర్ణం నెగ్గిన భారత స్టార్ షాట్ పుటర్
Asian Athletics Championships : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షాట్ పుటర్(Shot-Putter) తేజిందర్‌పాల్ సింగ్ తూర్(Tajinderpal Singh Toor) అదరగొట్టాడు. వరుసగా రెండోసారి బంగారు పతకం గెలిచాడు. షాట్‌పుట్ పోటీలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో....
Asian Athletics Championships : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షాట్ పుటర్(Shot-Putter) తేజిందర్‌పాల్ సింగ్ తూర్(Tajinderpal Singh Toor) అదరగొట్టాడు. వరుసగా రెండోసారి బంగారు పతకం గెలిచాడు. షాట్‌పుట్ పోటీలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో తేజిందర్‌పాల్ తొలి ప్రయత్నంలోనే షాట్‌పుట్‌ను 20.23 మీటర్ల దూరం విసిరాడు. ఇరాన్‌కు చెందిన సబేరి మెహ్డీ(19.98 మీటర్లు), కజకిస్థాన్ అథ్లెట్ ఇవన్ ఇవనోవ్ (19.87 మీటర్ల) వెండి, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తేజిందర్పాల్కు ఘనమైన రికార్డు ఉంది. 2019లో అతను 20.22 మీటర్లతో స్వర్ణం సాధించాడు. 2017లో తేజిందర్ సిల్వర్ మెడల్‌తో సత్తా చాటాడు. పోయిన నెలలో భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్(National Inter-State Championships)లో ఈ స్టార్ షాట్‌పుటర్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
తేజిందర్‌పాల్ సింగ్

ఆ పోటీల్లో 21.77 మీటర్ల దూరం విసిరిన తేజిందర్‌పాల్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ (World Championships)కు క్వాలిఫై అయ్యాడు. బుడాపెస్ట్(Budapest)లో అగస్టు 17 నుంచి 27 వరకు వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
Mens Emerging Asia Cup | సెంచరీతో కదం తొక్కిన యశ్ ధుల్.. యూఏఈ ఏపై భారత ఏ జట్టు భారీ విజయం
Virat Kohli | సెహ్వాగ్‌ను దాటేసిన కోహ్లీ.. టెస్టుల్లో ఎక్కువ రన్స్ కొట్టిన ఐదో క్రికెటర్‌గా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

