జర్మనీ: జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. సెన్యమ్ ఇప్పటికే స్వర్ణం దక్కించుకోగా.. ఆదివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో గౌతమి-అభినవ్ జంట బంగారు పతకం కైవసం చేసుకుంది.
తుదిపోరులో భారత జంట 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఫ్రాన్స్‌కు చెందిన ముల్లర్-రొమైన్ జంట రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అభినవ్ రజతం నెగ్గగా.. సురుచి ఇందర్ సింగ్-శుభమ్ బిస్లా జోడీ కాంస్యం కైవసం చేసుకుంది.