టీమిండియాకు భారీ ఊరట.. బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్

సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్‌లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సుదీర్ఘ పర్యటన. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఊరట కలిగించే వార్తే ఇది. న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత కోహ్లి సేనకు బయో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ లభించనుంది. జూన్ 24న బబుల్ నుంచి బయటకు వెళ్లిపోతే మళ్లీ జులై 14న లోనికి రావాల్సి ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ వర్గాలు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించాయి.
ఇది ఎంతో ఊరట కలిగించే విషయమని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇంగ్లండ్‌తో రెండు నెలల పాటు జరిగే టెస్ట్ సిరీస్ ముగియగానే ప్లేయర్సంతా మళ్లీ ఐపీఎల్ బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులు వాళ్లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం రావడం మానసికంగా ఉల్లాసానికి గురి చేసేదే. ఆగస్ట్ 4న ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టెస్ట్ ఆడాల్సి ఉంది. అంటే ఫైనల్ ముగిసిన తర్వాత సుమారు 40 రోజుల సమయం ఉంది. అందులో 20 రోజులు ప్లేయర్స్‌ను స్వేచ్ఛగా వదిలేయనుండగా.. జులై 14 నుంచి మళ్లీ బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ గ్యాప్‌లో ప్లేయర్స్ యూకేలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. అయితే కొవిడ్ ఇంకా పూర్తిగా పోలేదని, అందువల్ల అందుకు తగినట్లు ప్లేయర్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది. యూకే దాటి ఇతర దేశాలకు వెళ్తే మళ్లీ ప్రయాణాలపై నిషేధం వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే యూకేలోని తిరిగే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

