Nishesh Basavareddy : టెన్నిస్ గ్రాండ్‌స్టామ్ టోర్నీలో భారత సంతతి కుర్రాడు నిశేష్ బసవారెడ్డి(Nishesh Basavareddy) పేరు మార్మోగిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో వైల్డ్ కార్డ్‌తో ఆడుగుపెట్టిన నిశేష్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏడోసీడ్ టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)ను మట్టికరిపించాడు. 148వ ర్యాంకరైన ఈ భారతీయ అమెరికన్ ధాటికి తొలి రౌండ్లో ఫ్రిట్జ్ చేతులెత్తేశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్‌కు చెమటలు పట్టించిన నిశేష్ ఈసారి మట్టికోర్టులో గెలుపు గర్జన చేశాడు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డేటా సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన నిశేష్ బసవారెడ్డి టెన్నిస్‌లోనూ రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆకట్టుకున్న ఈ కుర్రాడు రొలాండ్ గరోస్లో తొలి విజయంతో వారెవ్వా అనిపించాడు. తనకంటే మెరుగైన ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్‌పై అద్భుత విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
A little French went a LONG WAY for Nishesh Basavareddy 👏
The American defeated seventh seed Taylor Fritz and was then serenaded by the Roland-Garros crowd 🎶
↳ Roland-Garros. Every Match. Live & On Demand. Centre Court in 4K.#StanSportAU #RolandGarros pic.twitter.com/xuvKAlXMbT
— Stan Sport (@StanSportAU) May 24, 2026
తొలి సెట్‌ను 6-7తో కోల్పోయినా ఒత్తిడికి లోనవ్వని వినేశ్.. రెండో సెట్‌ను 7-5తో గెలుచుకున్నాడు. అదే ఊపులో ప్రత్యర్థికి ఏ అవకాశమివ్వకుండా మూడో సెట్‌ను కైవసం చేసుకొని ఫ్రిట్జ్‌ను ఇంటికి పంపాడు. మ్యాచ్ అనంతరం కోర్టులో మాట్లాడుతూ ఇది కచ్చితంగా నా కెరీర్లో అతిపెద్ద విజయం. అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ముందు ఆడడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఈరోజు నాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు. మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో మెయిన్ డ్రా ఆడుతున్నా. మీ అందరి మద్దతు మళ్లీ లభిస్తుందని ఆశిస్తున్నా అని 21 ఏళ్ల నిశేష్ పేర్కొన్నాడు.
PRIMER BATACAZO EN #RolandGarros
Nishesh Basavareddy 🇺🇸 superó a Taylor Fritz 🇺🇸 (8º) por 7-6(5), 7-6(5), 6-7(11) y 6-1 para avanzar a la segunda ronda. pic.twitter.com/4OrlqvaEVF
— Respiro Tenis (@Respiro_Tenis) May 25, 2026