Chess | ఎనిమిదేండ్లకే ‘గ్రాండ్ మాస్టర్’ హోదా.. భారత సంతతి చిన్నారికి సలాం కొట్టాల్సిందే
Chess : అరవై నాలుగు గడుల చదరంగం(Chess) ఆటలో భారతీయులు పలు రికార్డులు నెలకొల్పారు. విశ్వనాథన్ ఆనంద్ (Vishwanathan Anad) నుంచి యువ కెరటం ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) వరకూ పలువురు ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. తాజాగా ఈ జాబితాలో భారతీయ మూలాలున్న...
Chess : అరవై నాలుగు గడుల చదరంగం(Chess) ఆటలో భారతీయులు పలు రికార్డులు నెలకొల్పారు. విశ్వనాథన్ ఆనంద్ (Vishwanathan Anad) నుంచి యువ కెరటం ఆర్ ప్రజ్ఞానంద(R Praggnanandhaa) వరకూ పలువురు ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. తాజాగా ఈ జాబితాలో భారతీయ మూలాలున్న ఎనిమిదేండ్ల అమ్మాయి చేరింది. పసి ప్రాయంలోనే చెస్‌లో గొప్పగా రాణిస్తున్న ఆ చిన్నారి పేరు బోధన శివానందనన్(Bodhana Sivanandan). తాజాగా క్రొయేషియాలో జరిగిన యూరోపియన్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో బోధన అద్భుతం చేసింది.
తనకంటే 30 ఏండ్ల పెద్దదైన, ఎంతో అనుభవజ్ఞురాలైన క్రీడాకారిణిని బోధన అవలీలగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి తన ఎత్తులతో ప్రత్యర్థిని కంగారెత్తించిన బోధన 8.5 12తో విజేతగా నిలిచి దిగ్గజాలను ఫిదా చేసింది. అంతేకాదండోయ్ ‘అత్యుత్తమ మహిళా ప్లేయర్'(Best Female Player) టైటిల్ సొంతం చేసుకుంది. దాంతో, అందరూ ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సలాం కొడుతున్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, భవాని

అంతర్జాతీయ వేదకపై అద్భుతంగా రాణించిన బోధన ప్రతిభకు చెస్ దిగ్గజాలు ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) సైతం బోధనను ఎంతో మెచ్చుకున్నారు. అయితే.. బోధనకు చిన్నప్పటి నుంచి చెస్ ఆడడం తెలియదని ఆమె తండ్రి శివానందన్ వెలయుథమ్(Sivanandan Velayutham) అంటున్నాడు. నా కూతురు చెస్ ఆడడం మొదలుపెట్టి మూడేండ్లు మాత్రమే అవుతోంది. కానీ, తక్కువ సమయంలోనే తను బాగా మెరుగయింది. పోటీ పడిన ప్రతి టోర్నమెంట్లో బోధన ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ టోర్నమెంట్లో ఆమెకు అన్నీ కలిసొచ్చాయి అని శివానందన్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి
- Yadadri | యాదగిరిగుట్ట కొత్త ఈఓగా రామకృష్ణ రావు
- IND vs RSA | పవర్ ప్లేలో తడబడ్డ భారత్.. ఆ ఇద్దరూ నిలబడతారా..?
- KTR | తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్సే కారణం : కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

