పంచ్ అదిరేనా..

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం ద్వారా భారత బాక్సర్లు ఒలింపిక్ పతకాలపై ఆశలు రేపుతున్నారు. 9 మంది భారత బాక్సర్లు విశ్వక్రీడలకు అర్హత సాధించగా.. మేరీకోమ్, అమిత్ పంగల్పైనే అందరి దృష్టి నిలువనుంది. లండన్ (2012) ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గడం ద్వారా బాక్సింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు).. తన చివరి విశ్వక్రీడల్లో పతకం సాధించి కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలనుకుంటుంటే.. లైట్ వెయిట్లో రికార్డులు తిరగరాసేందుకు పంగల్ (52 కేజీలు) రెడీ అవుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందాన్ని ముందుండి నడిపించనున్న మేరీ.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఫిలిప్పీన్స్ బాక్సర్‌ను చిత్తుచేసి విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ 38 ఏండ్ల మేరీకోమ్ ఈ సారి స్వర్ణంపై గురిపెట్టగా.. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), పూజారాణి (75 కేజీలు)లు కూడా పతకం పట్టాలనే కసిమీద ఉన్నారు. పురుషుల విభాగంలో బీజింగ్ఒలింపిక్స్లో విజేందర్ సింగ్ కాంస్యం నెగ్గడంతో మనదేశంలో బాక్సింగ్‌కు క్రేజ్ పెరిగింది. అతడిని స్ఫూర్తిగా తీసుకొని రింగ్‌లో అడుగుపెట్టిన యువ బాక్సర్ అమిత్ పంగల్.. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి ఒలింపిక్స్ పతకంపై అంచనాలు పెంచేశాడు. అన్నీ కలిసివస్తే వికాస్ క్రిషన్ (69 కేజీలు), మనీశ్ కౌషిక్ (63 కేజీలు), ఆశీష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా చరిత్ర లిఖించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Amit Panghal
- mary kom
- Tokyo
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

