Nikhil Chaudhary: ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. స్పిన్ బౌలర్ నిఖిల్ చౌదరీకి చోటు
Nikhil Chaudhary: క్రికెటర్ నిఖిల్ చౌదరీ చరిత్ర సృష్టించాడు. భారత సంతతికి చెందిన ఆ ఆల్‌రౌండర్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌తో వచ్చే వారం జరగనున్న టీ20 సిరీస్‌లో అతను ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేయనున్నాడు.
సిడ్నీ: భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరీ(Nikhil Chaudhary).. ఆస్ట్రేలియా జట్టుకు ఆడబోనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ నిఖిల్‌కు చోటు దక్కింది. ఆరు దశాబ్ధాల తర్వాత భారత క్రికెటర్ .. ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. స్థానికంగా హోబర్ట్ హరికేన్స్ జట్టు తరపున నిఖిల్ ఆడుతుంటాడు. ఒకవేళ అన్నీ కుదిరితే, వచ్చే వారం బంగ్లాతో జరిగే టీ20 మ్యాచ్‌లో అతను ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేయనున్నాడు.
బెల్జియంలో జరుగుతున్న ఈయూ20 టోర్నీలో జేబీ బ్రూగ్స్ జట్టు తరపున నిఖిల్ ఆడుతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అతను ఉన్నాడు. లెన్ స్పినర్ అయిన నిఖిల్.. బ్యాటింగ్ కూడా చేయగలడు. మిడిల్ ఆర్డర్లో బెర్త్ కోసం జోయల్ డేవిస్, ఆరన్ హార్డీతో అతను పోటీపడనున్నాడు. జూన్ 17 నుంచి 21 వరకు టీ20 సిరీస్ జరగనున్నది. బీబీఎల్ టోర్నీలో అతని ఫామ్ ఆకట్టుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు తెలిపారు.
ఆస్ట్రేలియా తరపున భారత సంతతి క్రికెటర్లు గతంలోనూ ఆడారు. గుర్వీందర్ సింధు, తన్వీర్ సంఘాలు ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించారు. కానీ వాళ్లు 1960 కన్నా ముందు ఆసీస్ తరపున ఆడారు. చివరిసారి 1964లో రెక్స్ సెల్లార్స్ అనే గుజరాతీ ప్లేయర్ ఆసీస్ తరపున ఆడాడు. ఇక పుణెలో పుట్టిన లీసా సత్లేకర్ కొన్నాళ్లు ఆస్ట్రేలియాకు ఆడారు. ఆమె 2003లో ఆసీస్ తరపున అరంగేట్రం చేసి 2013 వరకు ఆడారు.
నిఖిల్ చౌదరీ వయసు 30 ఏళ్లు. అతను ఆస్ట్రేలియా సిటిజన్ కాదు, కానీ అతను పర్మనెంట్ రెసిడెంట్. అయితే దత్తత తీసుకున్న దేశం చట్టాల ప్రకారం అతను ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉన్నది. ఢిల్లీలో పుట్టిన అతను పంజాబ్ తరపున 14 ఏ లిస్టు మ్యాచ్‌లు ఆడాడు. కోవిడ్ సమయంలో క్వీన్స్‌ల్యాండ్‌లోని మేనమామ ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడాడు. హోబర్ట్‌కు బీబీఎల్ టైటిల్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో అతను 30 సగటుతో 307 రన్స్ చేశాడు.
Nikhil Chaudhary could become the first Indian-born man to play for Australia in more than 60 years after being called up for the T20I series against Bangladesh. https://t.co/sp1FLkdvzg
— cricket.com.au (@cricketcomau) June 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

