IND vs IRE | టాస్ గెలిచిన భారత్.. వైభవ్ అరంగేట్రం వాయిదా..!
IND vs IRE : అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపై సందిగ్ధం వీడింది. మరొకరికి అన్యాయం చేయొద్దని భావించిన మేనేజ్మెంట్ అతడినే బెంచ్ మీద కూర్చోబెట్టింది.
IND vs IRE : అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపై సందిగ్ధం వీడింది. ఐర్లాండ్ పర్యటన తొలి టీ20తోనే అతడు ఎంట్రీ ఇస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఓపెనర్‌గా అతడిని ఆడించడం లేదని టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. పొట్టి వరల్డ్ కప్‌లో ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ను ఆడిస్తున్నామని అయ్యర్ పేర్కొన్నాడు. టాస్ గెలిచిన అతడు బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20ల్లో ఆగమనం వాయిదా పడింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ చెప్పినట్టు.. వైభవ్ కోసం మరొకరికి అన్యాయం చేయొద్దని భావించిన మేనేజ్మెంట్ అతడినే బెంచ్ మీద కూర్చోబెట్టింది. దాంతో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ను ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. గాయం నుంచి కోలుకుని స్క్వాడ్‌లోకి వచ్చిన హర్షిత్ రానాకు చోటు దక్కింది.
Here is how #TeamIndia lines up for the 1️⃣st T20I against Ireland 📝
Updates ▶️ https://t.co/gdoXw2dAKR#IREvIND pic.twitter.com/H5nvE6XpQE
— BCCI (@BCCI) June 26, 2026
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, సుందర్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
ఐర్లాండ్ తుది జట్టు : టిమ్ టక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లొర్కాన్ టక్నర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గరెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియాం మెక్‌కార్తీ, మాథ్యూ హంప్రెస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

