సాత్ సితారా.. ఏడోసారి ఆసియాకప్ భారత్ కైవసం
స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చిన భారత మహిళల జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియాకప్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
- ఫైనల్లో లంకపై ఘన విజయం
ఆసియాకప్‌లో తమకు తిరుగులేదని మన అమ్మాయిలు మరోసారి నిరూపించారు. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు జరిగిన ఈ టోర్నీలో భారత్ ఏడోసారి విజేతగా నిలిచింది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో టీమ్ఇండియా విజృంభించింది. మొదట బౌలర్లు రాణించడంతో లంక 65 పరుగులకే పరిమితం కాగా.. అనంతరం స్మృతి మందన ధనాధన్ ఇన్నింగ్స్‌తో 9 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించింది.
సిల్హెట్: స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చిన భారత మహిళల జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియాకప్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఆసియాకప్ నిర్వహించగా.. అందులో భారత జట్టు ఏడుసార్లు విజేతగా నిలువడం విశేషం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 65 పరుగులే చేసింది. ఇనోక (18 నాటౌట్), ఒశాడీ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మన బౌలర్లలో రేణుక మూడు వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 8.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 71 రన్స్ చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (25 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. మూడు ఓవర్లలో 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన రేణుకా సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, టోర్నీలో 94 పరుగులతో పాటు 13 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.

ఒకరి వెంట ఒకరు..
టోర్నీ ఆసాంతం రాణించిన మన బౌలర్లు ఫైనల్లో అంతకుమించి అదరగొట్టారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో లంక కెప్టెన్ చమరి ఆటపట్టు (6) రనౌట్ కాగా.. కాసేపటికే అనుష్క (2) కూడా రనౌట్ రూపంలోనే వెనుదిరిగింది. ఈ మధ్యలో రేణుక తన పేస్‌తో హర్షిత (1), హాసిని (0), కవిష (1)ను బుట్టలో వేసుకుంది. దీంతో ఆ జట్టు 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం ఛేదనలో వైస్ కెప్టెన్ స్మృతి మందన చెలరేగిపో యింది. ఫోర్లు, సిక్సర్లతో విశ్వరూపం కనబర్చింది. షఫాలీ (5), జెమీమా (2) ఎక్కువసేపు లువలేకపోయినా.. హర్మన్ (11*) తో కలిసి స్మృతి పని పూర్తి చేసింది.
ఈ ఘనత బౌలర్లకే దక్కుతుంది. తుదిపోరులో మా ఫీల్డింగ్ కూడా బాగుంది. మేం దీని గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నాం. వీలైనంత వరకు ప్రత్యర్థి జట్టుకు సులువుగా పరుగులు ఇవ్వకూడదని ముందే అనుకున్నాం. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని ముందుకు సాగాం. చాంపియన్‌గా నిలువడం చాలా ఆనందంగా ఉంది.
–హర్మన్‌ప్రీత్, భారత కెప్టెన్
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 65/9 (ఇనోక 18 నాటౌట్; రేణుక 3/5, స్నేహ్ రాణా 2/15), భారత్: 8.3 ఓవర్లలో 71/2 (స్మృతి 51 నాటౌట్; ఇనోక 1/17).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

