ఎవరిదో ఫైనల్ పంచ్!
భారీ స్కోర్లు నమోదవుతూ.. చెరో మ్యాచ్ నెగ్గుతూ.. అత్యంత హోరాహోరీగా సాగుతున్న భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆఖరి అంకానికి చేరింది.
- నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్, జియోస్టార్‌లో లైవ్
బెంగళూరు: భారీ స్కోర్లు నమోదవుతూ.. చెరో మ్యాచ్ నెగ్గుతూ.. అత్యంత హోరాహోరీగా సాగుతున్న భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆఖరి అంకానికి చేరింది. ఢీ అంటే ఢీ అన్నట్టు కొట్లాడుతున్న ఇరు జట్లు ప్రస్తుతం 2-2తో సమంగా ఉండగా శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐదో టీ20 మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది.
టీమిండిమా 2002 తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ చేతిలో ఏ ఫార్మాట్లోనూ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ రికార్డును అలానే కొనసాగించాలంటే ఉప్పల్‌లో బయటపడిన బలహీనతలను వెంటనే సరిదిద్దుకొని అయ్యర్‌సేన అన్ని విభాగాల్లోనూ కరీబియన్లపై ఆధిపత్యం చెలాయించాల్సి ఉంటుంది. కాగా, ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అర్ష్‌దీప్ డౌట్..జట్టులోకి భువీ
సిరీస్‌లో పరుగుల ప్రవాహం సాగుతున్నా.. బ్యాటింగ్‌లో కొన్ని సమస్యలు భారత్‌కు ఇబ్బందిగా మారాయి. ఓపెనర్లు శాంసన్, అభిషేక్ వ్యక్తిగతంగా సత్తాచాటుతూ మూడు అర్ధశతకాలు రాబట్టినా.. జోడీగా జట్టుకు ఆశించిన ఆరంభాలను అందించడం లేదు. ఇక, ఒకసారి ఓపెనింగ్ జోడీ విడిపోయినా తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇషాన్, కెప్టెన్ అయ్యర్, నమన్ధీర్ శుభారంభాలను సద్వినియోగం చేసుకోవడం లేదు.
ఉప్పల్‌లో తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి పోరాడినా 12.1 నుంచి 14.4 ఓవర్ల మధ్యలో 18 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టకపోవడం జట్టును దెబ్బతీసింది. బెంగళూరులో ఈ తెలుగు క్రికెటర్లు తమ పూర్తి తెగువ చూపెట్టాల్సిన అవసరం ఉంది. నాలుగో టీ20లో ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎడమ భుజానికి గాయమైంది. దాంతో తను ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహంగా మారింది. సెలక్టర్లు అప్రమత్తమై.. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను అతనికి బ్యాకప్‌గా జట్టుకు ఎంపిక చేశారు. నవంబర్ 2022 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని 36 ఏండ్ల భువీకి ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్‌గా బెంగళూరు పిచ్‌పై పూర్తి పట్టుంది.
దాంతో తను తుది జట్టులో ఆడే చాన్స్ ఉంది. అలాగే, చిన్న బౌండరీల కారణంగా గత మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన చైనామన్ కుల్దీప్ను కూడా తుది జట్టులోకి తీసుకునే అంశాన్ని మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. మరోవైపు భారత పర్యటనలో వెస్టిండీస్ అనూహ్యంగా, అద్భుతంగా ఆడుతోంది. కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ షై హోప్‌తో పాటు రూథర్‌ఫర్డ్ ను అడ్డుకుంటేనే భారత్ సిరీస్ నెగ్గగలదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

