బ్యాట్లెత్తిసిన భారత్.. 125 రన్స్ తేడాతో అతి పెద్ద పరాజయం
టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ చెత్తాటతో నిరాశపరుస్తోంది. ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన అయ్యర్‌సేన వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది.
- మూడో టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం
నాటింగ్హమ్: టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ చెత్తాటతో నిరాశపరుస్తోంది. ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన అయ్యర్‌సేన వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది. గత పోరులో బౌలింగ్‌లో ఫెయిలైన భారత్ ఈసారి పేలవ బ్యాటింగ్‌తో అతి పెద్ద పరాజయంతో తలదించుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో 125రన్స్ తేడాతో ఓడింది. షార్ట్ ఫార్మాట్లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. 2019లో వెల్లింగ్టన్లో న్యూజిలాండ్ చేతిలో 80 రన్స్ తేడాతో ఓడిన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు మరింత చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్ ఇచ్చిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 11.4 ఓవర్లలో 76 రన్స్‌కే కుప్పకూలింది. జోష్ టంగ్ (4/28), జోఫ్రా ఆర్చర్ (3/29) పేస్ ధాటికి టాప్, మిడిలార్డర్ కుదేలైంది. ఓపెనర్లు అభిషేక్ (10), సూర్యవంశీ (13)తో పాటు ఇషాన్ (13), కెప్టెన్ అయ్యర్ (5), అక్షర్ (10), తిలక్ (3), శివం దూబే (2) పెవిలియన్‌కు క్యూకట్టడంతో జట్టుకు ఘోర పరాభవంతప్పలేదు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ టీమ్ 20 ఓవర్లకు 201/7 స్కోరు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), ఆల్‌రౌండర్ సామ్ కరన్ (41 నాటౌట్), జోస్ బట్లర్ (36) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో ప్రిన్స్, హర్షిత్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 గురువారం జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- India
- sports news
- t20
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

