త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఐతే భారత టెస్టు క్రికెటర్లు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందే అక్కడికి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో బ్రిటన్‌కు బయలుదేరి వెళ్లాలని భావించారు. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించడంతో మే చివరి వారంలోనే టీమ్ఇండియా అక్కడికి వెళ్లనున్నట్లు తెలిసింది.
భారత్‌లో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో ఇండియా నుంచి రాకపోకలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ రెడ్ లిస్ట్‌లో చేర్చింది. భారత క్రికెటర్లను ఇంగ్లాండ్‌లోకి అనుమతించేలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…బ్రిటన్ ప్రభుత్వంతో పాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

