WTC ఫైనల్ డ్రా లేదా టై అయితే ఎలా?

World Test Championship final: భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18-22 వరకు జరగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా లేదా టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. ఆరంభ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభ ఎడిషన్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగే తుదిపోరు డ్రా లేదా టైగా ముగిస్తే భారత్, న్యూజిలాండ్‌ను జాయింట్ విన్నర్లుగా ప్రకటిస్తారు. జూన్ 23వ తేదీని ఐసీసీ ఇప్పటికే రిజర్వ్ డేగా కేటాయించింది.
ఐదు రోజుల మ్యాచ్‌లో ఏదైనా కారణంతో ఆటకు ఆటంకం కలిగితే నష్టపోయిన ఆట సమయాన్ని రిజర్వ్ డే రోజు ఉపయోగిస్తారు. మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో సమయం కోల్పోయిన సందర్భంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఎప్పటికప్పుడు ఇరు జట్లకు తెలియజేస్తాడు. కోల్పోయిన సమయానికి అనుగుణంగానే రిజర్వ్‌డేను ఎలా ఉపయోగించుకోవాలో అప్డేట్ చేస్తాడు. మ్యాచ్‌లో గ్రేడ్ 1 డ్యూక్స్ బంతులను ఉపయోగిస్తారు. ఈ నిర్ణయాలను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభానికి ముందు జూన్ 2018లోనే తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్లో ఉన్న టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్‌కు బయల్దేరి వెళ్లనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

