T20 World Cup | టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ.. జట్టుతో ధోనీ కూడా

ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీని టోర్నీకి ఎంపిక చేసింది. అయితే, స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తీసుకుంది.
భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి యూఏఈలోని నాలుగు వేదికల్లో జరుగనుంది. మస్కట్ దుబాయి, అబుదాబి, షార్జాలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ గతేడాది అక్టోబర్ 15 – నవంబర్ 15 మధ్య భారత్‌లో జరుగాల్సి ఉంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తాత్కాలికంగా టోర్నీని ఐసీసీ వాయిదా వేసింది. మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో టోర్నీ వేదికను భారత్ నుంచి యూఏఈకి మార్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- Indian team
- mentor
- ms dhoni
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

