తొలి అడుగు ఘనంగా..
మహిళల ఆసియా కప్‌ను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ‘ఉమెన్ ఇన్ బ్లూ’.. బ్యాటింగ్‌లో తడబడినా బంతితో రెచ్చిపోయి థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో థాయ్.. 16.1 ఓవర్లలో 65 రన్స్‌కే ఆలౌటైంది. నాన్నాపాత్ (41) మినహా మిగిలిన బ్యాటర్లంతా తేలిపోయారు. భారత బౌలర్లలో దీప్తి (3/0) నందని (3/18) తలా మూడు వికెట్లు తీయగా శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది.
- థాయ్‌లాండ్‌పై భారత్ భారీ విజయం
- మెరిసిన షెఫాలీ, దీప్తి
దుబాయ్: మహిళల ఆసియా కప్‌ను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ‘ఉమెన్ ఇన్ బ్లూ’.. బ్యాటింగ్‌లో తడబడినా బంతితో రెచ్చిపోయి థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో థాయ్.. 16.1 ఓవర్లలో 65 రన్స్‌కే ఆలౌటైంది. నాన్నాపాత్ (41) మినహా మిగిలిన బ్యాటర్లంతా తేలిపోయారు. భారత బౌలర్లలో దీప్తి (3/0) నందని (3/18) తలా మూడు వికెట్లు తీయగా శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. మొదట షెఫాలీ వర్మ (36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) మెరుపులతో భారత్ నిర్ణీత ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 159/9కే పరిమితమైంది. థాయ్ బౌలర్లలో లావొమి (3/26), సునిద (2/31) సంచలన బౌలింగ్‌తో ఉమెన్ ఇన్ బ్లూను దెబ్బకొట్టారు. షెఫాలీ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
షెఫాలీ బాదుడు
ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో స్మృతి (19), మరుసటి ఓవర్లో రెండు బౌండరీలతో షెఫాలీ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఫనిత మాయ మూడో ఓవర్లో సిక్స్ కొట్టిన మంధాన.. తర్వాతి బంతికే రనౌట్‌గా నిష్క్రమించింది. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన ప్రతీక (22)తో కలిసి షెఫాలీ దూకుడుగా ఆడింది. ఫోర్ల వర్షం కురిపించిన ఆమె.. సునిద 7వ ఓవర్లో 6,4తో అర్ధ శతకానికి చేరువైంది. లావోమి ఓవర్లో సిక్స్, సింగిల్‌తో టీ20ల్లో 19వ హాఫ్ సెంచరీని సాధించింది.కానీ మరుసటి బంతికే ప్రతీక క్లీన్‌బౌల్డ్ అవడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
పెవిలియన్‌కు క్యూ
11 ఓవర్లకు 107/2తో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన 12వ ఓవర్ నుంచి తడబడింది. థిపచ వేసిన ఆ ఓవర్లో హర్మన్ ఔట్ అవగా 13వ ఓవర్లో లావోమి.. షెఫాలీతో పాటు రిచానూ పెవిలియన్‌కు పంపి షాకిచ్చింది. ఆ తర్వాత భారత్ కోలుకోలేదు. ఆదుకుంటారని అనుకున్న దీప్తి (5) రనౌట్ అవగా సునిద 17వ ఓవర్లో ఫల్మలి (13), ప్రేమ రావత్ (6) పనిపట్టింది. ఆఖర్లో క్రాంతి (15 నాటౌట్) మెరుపులతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. 29 పరుగులకు భారత్ చివరి 7 వికెట్లను కోల్పోవడం గమనార్హం.
ఆ ఒక్కతే..
బంతితో భారత్‌ను కట్టడిచేసిన థాయ్‌లాండ్.. బ్యాట్‌తో ఆ మ్యాజిక్ ను చేయలేకపోయింది. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగులు వేస్తున్న ఆ జట్టు అనుభవలేమి కారణంగా భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోలేకపోయింది. వికెట్‌కీపర్ బ్యాటర్ నాన్నాపాత్ మాత్రమే రెండంకెల స్కోరును చేయగల్గింది. ఆమె తర్వాత జట్టులో అత్యుత్తమ స్కోరు 6గా నమోదవడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లకు 159/9 (షెఫాలీ 64, ప్రతీక 22, లావొమి 3/26, సునిద 2/31); థాయ్‌లాండ్: 10 ఓవర్లకు 65 ఆలౌట్ (నానాపట్ 41, లావొమి 6, దీప్తి 3/0, నందని 3/18)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

