Cricketers – Body Shaming | పృథ్వీ షాపై ట్రోలింగ్.. బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న స్టార్ క్రికెటర్లు వీళ్లే
Cricketers - Body Shaming : వన్డే కప్(One Day Cup)లో డబుల్ సెంచరీతో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఫామ్ అందుకున్నాడు. రెండు దేశాల్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ద్విశతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే.. ఆ సంతోషం అతడికి ఎంతోసేపు నిలువలేదు. అందుకు కారణం సోషల్‌మీడియాలో ట్రోలింగ్. క్రికెటర్లపై బాడీ షేమింగ్ అనేది ఇంతకు ముందు నుంచే ఉంది. ఈ సమస్యతో ఇబ్బందిపడిన....
Cricketers – Body Shaming : వన్డే కప్(One Day Cup)లో డబుల్ సెంచరీతో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఫామ్ అందుకున్నాడు. వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగిన షా 153 బంతుల్లో 244 రన్స్ కొట్టి ఔరా అనిపించాడు. రెండు దేశాల్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ద్విశతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే.. ఆ సంతోషం అతడికి ఎంతోసేపు నిలువలేదు. అందుకు కారణం సోషల్‌మీడియాలో ట్రోలింగ్. లావుగా ఉండడంతో పాటు తలపై వెంట్రుకలు తక్కువ ఉండడంతో అతడిని కొందరు బాడీ షేమింగ్(Body shaming) చేస్తున్నారు. అయితే.. క్రికెటర్లపై బాడీ షేమింగ్ అనేది ఇంతకు ముందు నుంచే ఉంది. ఈ సమస్యతో ఇబ్బందిపడిన స్టార్ ఆటగాళ్లు ఎవరంటే..?
ఒకప్పుడు బాడీ షేమింగ్ సినిమా రంగంలోని సెలబ్రిటీలకే పరిమితమయ్యేది. కానీ, క్రమంగా క్రికెట్‌కు కూడా విస్తరించింది. లావు, ఎత్తు, శరీర రంగు కారణంగా చాలామంది క్రికెటర్లు ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు. వాళ్లలో భారత క్రికెటర్లు కూడా ఉన్నారు. విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) గతంలో బాడీ షేమింగ్ బారిన పడ్డాడు. లావెక్కిన రోహిత్‌ను సన్నగా ఉన్న తోటి ఆటగాళ్లతో పోల్చేవారు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) ఓ సందర్భంలో రోహిత్ టీవీలో ఫిట్‌గా కనిపించడం లేదని అన్నాడు.
రోహిత్ శర్మ

యోయో టెస్టులో అతను తేలిపోవడం పక్కా.. అంటూ పలువురు వివర్శించారు. దాంతో, బాధ పడిన హిట్‌మ్యాన్ ఆ కోపాన్నంతా తన బ్యాటింగ్‌లో చూపించాడు. వన్డేల్లో మరెవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
రిషభ్ పంత్

టీమిండియా వికెట్ కీపర్, మ్యాచ్ విన్నర్ రిషభ్ పంత్(Rishabh Pant) కూడా బాడీ షేమింగ్‌కు బలయ్యాడు. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో దంచి కొట్టిన పంత్ బొద్దుగా మారడంతో విమర్శల పాలయ్యాడు. ఆసీస్ ఆటగాడు మాథ్యూ వేడ్ ‘నువ్వు 25 నుంచి 30 కిలోలు బరువు ఎక్కువ ఉన్నావు’ అని పంత్‌ను స్లెడ్జింగ్ చేశాడు. అంతేకాదు లావెక్కడంతో అతను మునపటిలా షాట్లు ఆడలేకపోతున్నాడని, ఒళ్లు తగ్గిస్తే గొప్ప ఆటగాడు అవుతాడని మాజీ క్రికెటర్లు సైతం పంత్‌పై కామెంట్లు చేశారు.
వెస్టిండీస్ బాహుబలి
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్(Rakeem Cornwall) కూడా బాడీ షేమింగ్ బాధితుడే. భారీ కాయంతో, నల్లని రంగులో ఉండే అతను అత్యంత బరువైన టెస్టు క్రికెటర్‌గా వార్తల్లో నిలిచాడు. అంతేకాదు తనపై జోకులు వేసేవాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పాడు. ‘నా శరీరాకృతిని నేను మార్చుకోలేను. నేను చాలా పొడవుగా, చాలా పెద్దగా ఉన్నానని చెప్పను. అయితే.. ఎవరూ కూడా పొట్టిగా ఉండాలని కోరుకోరు.
రకీం కార్న్‌వాల్

అలానే సన్నగా ఉండడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. అందుకని నేను ఏం చేస్తానంటే.. మైదానంలోకి వెళ్లి నా నైపుణ్యం చూపిస్తా’ అని కార్న్‌వాల్ తెలిపాడు. 30 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గొప్ప రికార్డు ఉంది. 82 మ్యాచుల్లోనే 2,957 పరుగులు చేయడంతో పాటు 390 వికెట్లు తీశాడు. విండీస్ తరఫున ఇప్పటివరకూ రకీం 10 టెస్టులు ఆడాడంతే.
ఫ్లింటాఫ్.. ఈటింగ్ డిజార్డర్
ప్రపంచంలోని గొప్ప ఆల్రౌండర్లలో ఇంగ్లండ్ ఆటగాడైన ఆండ్రూ ఫ్లింటాఫ్(Andrew Flintoff) ఒకడు. అతడికి ఈటింగ్ డిజార్డర్ ఉండేది. దాంతో, కెరీర్ ఆరంభంలో తాను బాడీ షేమింగ్, ఆత్మన్యూనతతో బాధపడ్డానని ఫ్లింటాఫ్ ఒకసారి చెప్పాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆ తర్వాత ప్రొఫెషన్ బాక్సింగ్‌లో అడుగుపెట్టాడు.

అయితే.. క్రికెటర్లపై బాడీ షేమింగ్‌ను టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) తప్పుబట్టాడు. లావుగా ఉన్నాడనే కారణంతో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)ను జట్టులోకి తీసకోకపోవడం పట్ల అతను ఘాటుగా స్పందించాడు.
సునీల్ గవాస్కర్, సర్ఫరాజ్ ఖాన్

‘సన్నగా, నాజూకుగా ఉన్న క్రికెటర్లను మాత్రమే ఇష్టపడేందుకు ఇది ఫ్యాషన్ షో కాదు. మోడల్స్‌కు బాల్, బ్యాట్ ఇచ్చి క్రికెట్ ఆడమనడం లాంటిది. ప్రపంచంలో అన్ని రకాల శరీరాకృతితో ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అందుకని ఆటగాళ్ల ఎత్తు, బరువుని కాకుండా వాళ్లు సాధించిన పరుగులు, తీసిన వికెట్లను గమనించాలి’ అని గవాస్కర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి
Kane Williamson | నా ముందున్న అతిపెద్ద లక్ష్యమదే..! ప్రపంచ కప్‌పై విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rohit Sharma | కోహ్లీ, నేను టీ20లు ఆడకపోవడానికి కారణమదే..! రోహిత్ శర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

