IND vs SL : శ్రీలంక వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్‌గా వచ్చిన రాజపక్సేను స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేశాడు. 147 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ విసిరిన బంతి వికట్లను గిరాటేసింది. అంతకుముందు ముందు ఓవర్లో యజువేంద్ర చాహల్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ప్రమాదరకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడీని అతను విడదీశాడు. హాఫ్ సెంచరీ చేసిన కుశాల్ మెండిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. చాహల్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి మెండిస్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి శ్రీలకం 93 రన్స్ చేసింది. నిస్సంకా 31,చరిత అసలంక 3 పరుగులతో ఆడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్లు మెండిస్, నిస్సంకా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. 27 బంతుల్లో4 సిక్స్‌లు, 3 ఫోర్లతో అర్థ సెంచరీ బాదాడు. మరో ఓపెనర్ ప్రధుమ్ నిస్సంకా 22 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్లో మెండిస్ రెచ్చిపోయాడు. శివం మావి వేసిన నాలుగో ఓవర్లో మెండిస్ 3 ఫోర్లు బాదాడు.
టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు శ్రీలంక ఈ సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితి.