భారత వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీల వెన్ను విరుస్తున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 43వ ఓవర్లో వియాన్ ముల్డర్ (12) వికెట్ కూల్చాడు.
అంతకు ముందు ఓవర్లో మంచి కవర్ డ్రైవ్ ఆడిన ముల్డర్.. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని మరోసారి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి కుదరలేదు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి పంత్ వైపు వెళ్లింది. దాన్ని పంత్ అందుకోవడంతో ముల్డర్ కథ ముగిసింది. దీంతో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయింది.
టెంపా బవుమా (52 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించడం లేదు. అదే సమయంలో భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ సఫారీ బ్యాటర్లను కుదురుకోనీయడం లేదు.