IND Vs SA | రాంచీ వన్డేలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్.. హింట్స్ ఇచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్
IND Vs SA | భారత్-దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నది. రాంచీ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగనున్నది. మధ్యాహ్నం 1.30 గంటలకు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మ్యాచ్ మొదలుకానున్నది.
IND Vs SA | భారత్-దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నది. రాంచీ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగనున్నది. మధ్యాహ్నం 1.30 గంటలకు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మ్యాచ్ మొదలుకానున్నది. ఈ మ్యాచ్‌లో స్టార్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు తుది జట్టులో స్థానంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టతనిచ్చాడు. పంత్ జట్టులో వికెట్ కీపర్‌గా మాత్రమే కాకుండా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఆడే సామర్థ్యం ఉదని వ్యాఖ్యానించాడు. ఆగస్టు 2024లో శ్రీలంక పర్యటన తర్వాత పంత్ వన్డేలు ఆడలేదు.
దాంతో పంత్‌కు తుది జట్టులో చోటుపై అనిశ్చితి కొనసాగుతుంది. పంత్ జట్టుకు విలువైన ఆటగాడని రాహుల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. ‘రిషబ్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండాలని వచ్చింది. కానీ, అతను చాలాకాలం జట్టుతో ఉన్నాడు. అతను ఏం చేయగలడో అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఆటగాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం వేచి ఉండాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నాడు. పంత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే, వికెట్ కీపింగ్ చేస్తాడని.. ఆ సమయంలో తాను కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేస్తానని రాహుల్ చెప్పుకొచ్చాడు. రిషబ్ కేవలం కీపర్ మాత్రమే కాదని.. అతనో గొప్ప బ్యాట్స్‌మెన్ అంటూ చెప్పాడు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వన్డే జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌పై సైతం రాహుల్ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో పాటు రుతురాజ్ ఓపెనింగ్ పోటీపడుతున్నాడు.
ఇటీవల దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన మ్యాచ్‌లో రాణించాడు. గైక్వాడ్ ఓ క్లాస్ ప్లేయర్ అని.. తనకు అవకాశం లభించిన ప్రతిసారీ తనను తాను నిరూపించుకున్నాడని తెలిపాడు. దురదృష్టవశాత్తు భారత టాప్-ఆర్డర్ చాలా బలంగా ఉందని.. స్థిపడడంతో చాలామంది ఆటగాళ్లకు చోటు దక్కలేదని రాహుల్ తెలిపాడు. తాజాగా ప్లేయర్లు గాయాల బారిపడడంతో అతనికి మళ్లీ ఆడే అవకాశం దక్కిందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అతని నైపుణ్యంపై ఎలాంటి సందేహం లేదని.. అతనికి సరైన అవకాశం అవసరమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో ఘోర పరాజయం పాలైంది. టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో ఓడిపోయింది. తాజాగా వన్డేల్లోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని యోచిస్తుంది.
భారత జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
దక్షిణాఫ్రికా జట్టు : టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రూయిస్, నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, టోనీ డీ జార్జి, రూబిన్ హెర్మన్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, కేశవ్ మహరాజ్, లుంగీ ఆర్ ఎన్గిడి, రియాన్ రికెల్టన్, ప్రేనెలన్ సుబ్రాయెన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

