IND vs SA 2nd Test: మార్క్రమ్ శతకం.. కీలక ఆధిక్యం సాధించిన సఫారీలు.. భారత్ టార్గెట్ ఎంతంటే..!
IND vs SA 2nd Test: బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న న్యూలాండ్స్ పిచ్‌పై ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన బ్యాటర్ మార్‌క్రమే. అతడి విజృంభణతో సఫారీలు కీలక ఆధిక్యాన్ని సాధించారు.. మరి పేసర్లకు స్వర్గధామంగా ఉన్న న్యూలాండ్స్ పిచ్‌పై భారత బ్యాటర్లు ఏం చేసేనో..?
IND vs SA 2nd Test: భారత్‌తో కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండోటెస్టులో భాగంగా సఫారీ ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (103 బంతుల్లో 106, 17 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. 99 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్న మార్క్రమ్.. సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యం అందించాడు. బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న న్యూలాండ్స్ పిచ్‌పై 50 ప్లస్ స్కోరు చేసిన తొలి బ్యాటర్ (ఈ మ్యాచ్‌లో) మార్‌క్రమే. మిగిలిన బ్యాటర్లు విఫలమవుతున్న చోట మార్క్రమ్.. బౌండరీలు, సిక్సర్లతో విరుచుపడటం గమనార్హం. బుమ్రా విజృంభించడంతో సౌతాఫ్రికా.. 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ డ్రా చేయాలంటే భారత్.. 79 పరుగులు చేయాల్సి ఉంది. పేసర్లకు స్వర్గధామంగా మారిన కేప్‌టౌన్ పిచ్‌పై భారత బ్యాటర్లు ఏం చేసేనో అనేది ఆసక్తికరంగా మారింది.
బుమ్రా ఆన్ ఫైర్..
ఓవర్ నైట్ స్కోరు 62-3తో రెండో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాకు బుమ్రా వరుసషాకులిచ్చాడు. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే బెడింగ్హమ్ (11) కెఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 22వ ఓవర్లో బుమ్రా.. వికెట్ కీపర్ వెరీన్ (9) ను ఔట్ చేశాడు. ముఖేశ్ కుమార్ వేసిన23వ ఓవర్లో మూడో బంతికి బౌండరీ కొట్టిన మార్క్రమ్.. 68 బంతుల్లో అర్థ సెంచరీ చేసుకున్నాడు.
ఇక బుమ్రా.. 24వ ఓవర్లో ఐదో బంతికి జాన్సెన్ (11) ను కూడా పెవిలియన్ చేర్చాడు. బుమ్రా తన తర్వాతి ఓవర్లో కేశవ్ మహారాజ్ (3) ను కూడా ఔట్ చేయడంతో సఫారీలు ఏడో వికెట్ కోల్పోయారు. ఏడో వికెట్ కోల్పోయేటప్పటికీ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న మార్క్రమ్ తర్వాత రెచ్చిపోయాడు. సిరాజ్ వేసిన 27వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన మార్క్రమ్.. ప్రసిధ్ కృష్ణ వేసిన 29వ ఓవర్లో 4, 6, 6, 4 బాది 20 పరుగులు రాబట్టడంతో అతడు సెంచరీకి చేరువయ్యాడు. బుమ్రా వేసిన 30 వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన మార్క్రమ్.. సెంచరీ పూర్తి చేశాడు.
సెంచరీ తర్వాత సిరాజ్.. అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. సిరాజ్ వేసిన 32వ ఓవర్లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి రోహిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మార్క్రమ్ నిష్క్రమించాక మరుసటి ఓవర్లోనే ప్రసిధ్.. రబాడ (2)ను ఔట్ చేశాడు. ఎంగిడిని కూడా బుమ్రానే ఔట్ చేయడంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా ముఖేశ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

