IND vs PAK | షహీన్‌ను ఎలా ఎదుర్కోవాలి?.. సచిన్ సూచనలు ఇవే!
IND vs PAK | టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పాక్ జట్టులో భారత్‌కు సమస్యలు సృష్టించే బౌలర్లలో షహీన్ షా అఫ్రిదీ ఒకడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పాక్ జట్టులో భారత్‌కు సమస్యలు సృష్టించే బౌలర్లలో షహీన్ షా అఫ్రిదీ ఒకడు. కొత్త బంతితో అతను గత ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో షహీన్‌ను బ్యాటర్లు ఎలా ఎదుర్కోవాలని చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. దీనికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సమాధానం ఇచ్చాడు. తను ఆడే రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎడం చేతి వాటం పేసర్ వసీం అక్రమ్‌ను చాలా సార్లు ఎదుర్కొన్న సచిన్.. షహీన్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
షహీన్‌ను ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేస్తారని సచిన్‌ను అడగ్గా.. అతన్ని ఎదుర్కొనే అవసరం తనకు రాదని, ఆ విషయం తనకు తెలుసు కాబట్టి ఎలాంటి ప్రిపరేషన్ చెయ్యడం లేదని సరదాగా బదులిచ్చాడు. అనంతరం అసలు విషయంలోకి వచ్చిన క్రికెట్ గాడ్..

‘షహీన్ ఒక ఎటాకింగ్ బౌలర్. లెంగ్త్ బాల్స్ వేయడం, వాటిని స్వింగ్ చేయడం తన స్పెషాలిటీ. మంచి పేస్ కూడా ఉండటంతో బంతి గాల్లో ఉన్నప్పుడు, అలాగే పిచ్ పడిన తర్వాత అతను బ్యాటర్లను బుట్టలో వేసుకుంటాడు. అతన్ని ఎదుర్కోవాలంటే స్ట్రెయిట్ షాట్లు ఆడాలి’ అని వివరించాడు.
షహీన్ బంతిని సరిగా అంచనా వేయలేక చాలా మంది ఎల్బీడబ్ల్యూగా కూడా పెవిలియన్ చేరుతుంటారు. ఈ పాయింట్ కూడా లేవనెత్తిన సచిన్.. ‘షాట్ ఆడే ముందు ట్రిగ్గర్ మూవ్మెంట్ ఉంటుంది. అంటే మన బాడీ షాట్ ఆడేందుకు సిద్ధం అవుతుందన్నమాట. అయితే ఇది కేవలం రెడీ అవడమే.
కచ్చితంగా ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ ఆ షాట్‌కు కమిట్ అయితే మార్చుకోవడం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాక్‌ఫుట్‌లో లేదంటే ఫ్రంట్‌ఫుట్‌లో బంతిని ఆడేందుకు ట్రిగ్గర్ మూవ్మెంట్ ఉంటుంది. ఆ మూవ్మెంట్ తీసుకున్నప్పటికీ ఏ షాటైనా ఆడొచ్చు.
కానీ ఒక్కసారి బ్యాక్‌ఫుట్ వెళ్లాలని కమిట్ అయి కదిలామంటే.. మళ్లీ ఫ్రంట్ ఫుట్కు షాట్ మార్చుకోడం కుదరదు’ అని సచిన్ విశ్లేషించాడు. ట్రిగ్గర్ మూవ్‌మెంట్‌కు కమిట్ అవకుండా ఉంటే.. షహీన్ వేసే బంతులను ఎదుర్కొనే ఛాన్స్ పెరుగుతుందని పేర్కొన్నాడు. మరి ఆదివారం నాడు భారత ఆటగాళ్లు షహీన్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

