IND vs NED: తొమ్మిదేండ్ల తర్వాత వికెట్ తీసిన కోహ్లీ.. అనుష్క రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్
IND vs NED: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం.
IND vs NED: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్‌తోనే కాదూ బంతితోనూ తన బౌలింగ్ స్కిల్స్‌ను చూపించాడు. నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. డచ్ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం.
కోహ్లీ వికెట్ తీయగానే స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న విరాట్ భార్య అనుష్క శర్మ పట్టరాని ఆనందంతో మురిసిపోయింది. ప్రత్యర్థఙ జట్టులో బ్యాటర్ ఎలా ఔట్ అయినా తనదైన దూకుడుతో సెలబ్రేషన్స్ చేసుకునే కోహ్లీ.. తన బౌలింగ్‌లోనే వికెట్ పడితే కామ్‌గా ఉంటాడా..? తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. అదే సమయంలో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న తన భార్యను చూస్తూ ‘నేను సాధించా’ అన్నట్టుగా రెండు చేతుల పిడికిలి బిగించి వేడుకలు చేసుకున్నాడు. భర్తను చూసిన అనుష్క సైతం అతడిని మరింత ఉత్సాహపరుస్తూ ‘యెస్.. ఇది నీకే సొంతం’ అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Kohli and Anushka Sharma celebrating together ♥️♥️pic.twitter.com/nAGgL2pmKs
— CoLuMbO🤡 (@columboclown) November 12, 2023
కాగా భారత్ నిర్దేశించిన 411 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ తడబడుతోంది. 34 ఓవర్లు ముగిసేటప్పటికీ డచ్ జట్టు.. 150 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.
ODI wickets of Virat Kohli:
– Cook
– Kieswetter
– De Kock
– McCullum
– Scott Edwards pic.twitter.com/4mtoSAbuq5— Johns. (@CricCrazyJohns) November 12, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

