Ravindra Jadeja | రాజ్‌కోట్‌లో సెంచరీ.. దిగ్గజాల సరసన జడ్డూ
Ravindra Jadeja | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు ద్విశతక (204) భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. సెంచరీ చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు.
Ravindra Jadeja | టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజ్‌కోట్ టెస్టులో శతకం సాధించి భారత్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు ద్విశతక (204) భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. సెంచరీ చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. టెస్టులలో 3 వేల పరుగులు చేయడమే గాక 250 ప్లస్ వికెట్లు తీసిన అతికొద్దిమంది ఆటగాళ్ల జాబితాలో జడేజా నిలిచాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా జడ్డూ రికార్డులకెక్కాడు.
టెస్టులలో బ్యాట్‌తో 3 వేల పరుగులు చేసి బంతితో 250 ప్లస్ వికెట్లు తీసినవారి జాబితాలో భారత్ నుంచి కపిల్ దేవ్, అశ్విన్ మాత్రమే ఉన్నారు. తాజాగా జడ్డూ వీళ్లకు జతకలిశాడు. కపిల్ దేవ్ తన కెరీర్లో 5,248 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లో 434 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో ఉన్న అశ్విన్.. 3,271 పరుగులు చేసి 499 వికెట్లు తీశాడు. జడేజా తాజా సెంచరీతో కలిపి 3003 పరుగులు, 280 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన నాలుగో స్పిన్ ఆల్ రౌండర్ జడేజానే. కివీస్ దిగ్గజ ఆటగాడు డేనియల్ వెటోరి (4,531 రన్స్, 362 వికెట్లు) , షేన్ వార్న్ (3,154 రన్స్, 708 వికెట్లు), అశ్విన్ తర్వాత జడేజా ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 3 వేల రన్స్, 250 ప్లస్ వికెట్లు సాధించిన వీరులు
– షేన్ వార్న్ – 3154 రన్స్, 708 వికెట్లు
– స్టువర్ట్ బ్రాడ్ – 3,662 రన్స్, 604 వికెట్లు
– అశ్విన్ – 3271 రన్స్, 499 వికెట్లు
– కపిల్ దేవ్ -5248 రన్స్, 434 వికెట్లు
– రిచర్డ్ హ్యాడ్లీ – 3124 రన్స్, 431 వికెట్లు
– షాన్ పొలాక్ – 3781 రన్స్, 421 వికెట్లు
– ఇయాన్ బోథమ్ – 5200 రన్స్, 383 వికెట్లు
– ఇమ్రాన్ ఖాన్ – 3807 రన్స్, 362 వికెట్లు
– డేనియల్ వెటోరీ – 4531 రన్స్, 362 వికెట్లు
– చమిందా వాస్ – 3089 రన్స్, 355 వికెట్లు
– జాక్వస్ కలిస్ – 13289 రన్స్, 292 వికెట్లు
– రవీంద్ర జడేజా – 3003 రన్స్, 280 వికెట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

