IND vs AUS : నయావాల్ చటేశ్వర్ పూజారా మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. కునేమాన్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులకు చేరువయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ (10) ఆడుతున్నాడు. పూజారాతో కలిసి భారత్ లీడ్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 45 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఖవాజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దూకుడుగా ఆడి ఆసీస్ మీద ఒత్తిడి పెంచాలనుకున్న శ్రేయాస్ అయ్యర్(26ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఉస్మాన్ ఖవాజా పల్టీ కొడుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 113 రన్స్ వద్ద భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. 118 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ లయాన్ కేఎస్ భరత్ (3)ను సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (5), రవీంద్ర జడేజా (7), కేఎస్ భరత్(3)లను ఔట్ చేసి ఇండియాను దెబ్బతీశాడు.