IND vs AUS : భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన తొలిఓవర్లోనే మ్యాజిక్ చేశాడు. భారత్కు తొలి వికెట్ అందించాడు. దంచికొడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్(13)ను బౌల్డ్ చేశాడు. దాంతో, మొదటి వికెట్కు 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ (17), జోష్ ఇంగ్లిస్(8) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు ఆసీస్ స్కోర్.. 40/1.
T. I. M. B. E. R!
Ravi Bishnoi strikes in his first over! 👏 👏
Australia lose Matthew Short.
Follow the match ▶️ https://t.co/T64UnGxiJU #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/6ANzxCzz0Q
— BCCI (@BCCI) November 23, 2023
నాలుగు రోజుల కిందటే వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్లో తలపడుతున్నాయి. విశాఖపట్టణంలో జరుగుతున్నతొలి టీ20లో టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకున్నాడు. విజయంతో సిరీస్ను ఆరంభించాలనే కసితో ఉన్న భారత్ ప్రసిధ్, బిష్ణోయ్, ముఖేశ్లను ఆడిస్తోంది. వరల్డ్ కప్ హీరోలు మ్యాక్స్వెల్, హెడ్, జంపాకు ఆసీస్ విశ్రాంతినిచ్చింది.