IND vs AUS | అడిలైడ్ టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం..
IND vs AUS | అడిలైడ్ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఐదు టెస్ట్‌లో సిరీస్‌లో 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో అద్భుతమైన ఆటతీరుతో గెలుపొందిన జట్టు.. రెండో డే-నైట్ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్లోను టీమిండియా చేతులెత్తేసింది. అయితే, ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య కేవలం రికార్డు స్థాయిలో అత్యంత తక్కువ సమయంలోనే ఈ మ్యాచ్ ముగిసింది.
IND vs AUS | అడిలైడ్ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఐదు టెస్ట్‌లో సిరీస్‌లో 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో అద్భుతమైన ఆటతీరుతో గెలుపొందిన జట్టు.. రెండో డే-నైట్ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్లోను టీమిండియా చేతులెత్తేసింది. అయితే, ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య కేవలం రికార్డు స్థాయిలో అత్యంత తక్కువ సమయంలోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా.. టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 18 పరుగుల లక్ష్యం బరిలోకి దిగింది. వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసి.. లక్ష్యాన్ని చేరుకున్నది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (9), నాథన్ మెక్‌స్వీనీ (10) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా.. భారత్ రెండో ఇన్నింగ్స్ 175 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై 18 పరుగుల ఆధిక్యం సంపాదించి కంగారూలకు 19 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగుల వద్ద ఆదివారం ఆట ప్రారంభించిన టీమిండియా 47 పరుగుకే ఐదు వికెట్లను కోల్పోయింది. రిషబ్ పంత్ రూపంలో టీమ్ ఇండియాకు తొలి దెబ్బ తగిలింది. 28 పరుగులు చేసి స్కార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అశ్విన్ (7), హర్షిత్ రాణా (0), నితీశ్ రెడ్డి (42), సిరాజ్(7) స్కోర్ మాత్రమే చేయగలిగారు. టీమిండియా తరఫున అత్యధిక స్కోర్ చేసింది నితీశ్ కుమార్‌రెడ్డి మాత్రమే. అతను 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌర్లలో కెప్టెన్ కమిన్స్ ఐదు వికెట్లు తీయగా.. బోలాండ్కు మూడు వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

