‘డ్రా’ అయితే సంయుక్త విజేత

- డబ్యూటీసీ ఫైనల్ ‘టై’ అయినా ఇరు జట్లకు కప్పు
- విధివిధానాలు వెల్లడించిన ఐసీసీ
దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ‘టై’ కావడంతో ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించి అందులో కూడా ఫలితం తేలకపోవడంతో.. ఎక్కువ బౌండ్రీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించి అభాసుపాలైన ఐసీసీ.. టెస్టు చాంపియన్‌షిప్ విషయంలో అలాంటి తప్పు జరుగకూడదని ముందస్తు చర్యలకు పూనుకుంది. వచ్చే నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలని ఐసీసీ నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల నిర్ణీత ఐదు రోజుల్లో 450 ఓవర్ల (రోజుకు 90 ఓవర్లు) ఆట సాధ్యం కాకపోతే.. ఆరో రోజును రిజర్వ్ డేగా ప్రకటించిన ఐసీసీ.. అప్పటిలోపు ఫలితం తేలకుంటే ఇరు జట్లను విజేతలుగా ప్రకటించనుంది. ‘ఐదు రోజుల ఆటలో ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను ‘డ్రా’గా ప్రకటిస్తాం’ అని ఐసీసీ శుక్రవారం తెలిపింది.
డ్యూక్ బంతులతో..
టీమ్ఇండియా స్వదేశంలో ఎస్జీ బంతులతో మ్యాచ్‌లు ఆడుతుండగా.. న్యూజిలాండ్ ఆటగాళ్లు కూకబుర్రా బంతులు వినియోగిస్తున్నారు. అయితే తటస్థ వేదికలో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ను డ్యూక్ బంతులతో నిర్వహించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cup
- draw match
- ICC
- ICC WTC final
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

