ICC | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ నిషేధం.. ఇకపై బౌలింగ్ చేయొద్దని ఆర్డర్..!
ICC | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు విదేశీ లీగ్‌లోనూ బౌలింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది.
ICC | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు విదేశీ లీగ్‌లోనూ బౌలింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది. షకీబ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా ఐసీసీ గుర్తించింది. నిబంధనల ప్రకారం 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేయి వంగకూడదు. దాన్ని బౌలింగ్‌గా అంగీకరించరు. గత కొంతకాలంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బౌలింగ్ టెస్ట్ సైతం నిర్వహించింది.
ఈ పరీక్షలో షకీబ్ మోచేయి నిబంధనలకు విరుద్ధంగా 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపుతున్నట్లుగా తేలింది. తొలుత అతనిపై ఇంగ్లండ్ బోర్డు నిషేధం విధించింది. ప్రస్తుతం ఐసీసీ సైతం వేటు వేసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించింది. ఐసీసీ నిషేధం నేపథ్యంలో జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అనర్హుడని బోర్డు పేర్కొంది. 37 ఏళ్ల షకీబ్ అల్ హసన్ ఓ ఆల్ రౌండర్‌గా ఆ దేశ జట్టుకు సేవలందించాడు. ఇప్పటి వరకు 71 టెస్టులు ఆడాడు. ఇందులో 37 సగటుతో 4,609 పరుగులు చేశాడు. అలాగే, 246 వికెట్లు పడగొట్టాడు. ఇక 247 వన్డేలు ఆడి 7,570 పరుగులు చేయగా.. 317 వికెట్లు కూల్చాడు. 129 టీ20ల్లో 2,551 పరుగులు చేసి.. 149 వికెట్లు తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

