Cricket: ఒలింపిక్స్‌లో క్రికెట్.. గట్టిగా ప్రయత్నిస్తున్న ఐసీసీ
ఒలింపిక్స్‌లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్‌ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).

దుబాయ్: ఒలింపిక్స్‌లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్‌ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ విషయాన్ని మంగళవారం ఐసీసీనే ధృవీకరించింది. అంతేకాదు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా గట్టి ప్రయత్నాలు చేయడానికి ఓ వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేలా ఇప్పటి నుంచే ఈ వర్కింగ్ గ్రూప్ ప్రయత్నాలు మొదలు పెట్టనుంది.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై మంగళవారం ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్పందించారు. ఐసీసీ తరఫున ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి, టోక్యోకు శుభాకాంక్షలు. క్లిష్ట సమయంలోనూ విజయవంతంగా గేమ్స్‌ను నిర్వహించారు. ఈ గేమ్స్‌లో క్రికెట్ ఉండాలని మేమూ ఆశిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు 100 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందులో 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడగా చూడాలనుకుంటున్నారు. దక్షిణాసియాలోనే 92 శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమెరికాలో మరో 3 కోట్ల మంది ఉన్నారు. వీళ్లంతా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడాలని ఆశపడుతున్నారు అని బార్క్లే అన్నారు.
అయితే ఇది అంత సులువు కాదు. ఇప్పటికే చాలా గేమ్స్ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లో భాగం కావడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాం అని బార్క్లే చెప్పారు. ఈ వర్కింగ్ గ్రూప్‌కు ఈసీబీ చైర్మన్ ఇయాన్ వాట్మోర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

