Bhavina Patel: సచిన్‌ను కలిసి నా మెడల్ చూపిస్తా!
పాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ( Bhavina Patel ).. తాను సచిన్ టెండూల్కర్‌ను కలుస్తానని చెప్పింది. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో సాధించిన విజయాల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు ఆమె తెలిపింది.

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ( Bhavina Patel ).. తాను సచిన్ టెండూల్కర్‌ను కలుస్తానని చెప్పింది. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో సాధించిన విజయాల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు ఆమె తెలిపింది. తన ఆరాధ్య ప్లేయర్‌ను కలిసి, అతనికి తన మెడల్ చూపిస్తానని భవీనా చెప్పింది. నేను ఎప్పుడూ సచిన్ నుంచి ప్రేరణ పొందాను. అతన్ని నేరుగా కలవాలని అనుకుంటున్నాను. అతడు చెప్పే మోటివేషనల్ స్పీచ్‌లను వింటే నా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అని ఎన్డీటీవీతో మాట్లాడుతూ భవీనా చెప్పింది.
తన బలం ధ్యానం చేయడమే అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది. టేబుల్ టెన్నిస్ గేమ్ 10-15 నిమిషాల్లో ముగుస్తుంది. ఇది ప్రపంచంలో రెండో అత్యంత వేగంగా ముగిసిపోయే గేమ్. అందుకే నేను నా మెదడును మెడిటేషన్‌తో నియంత్రిస్తాను. అది ఆటపై దృష్టిసారించడానికి ఎంతగానో సాయపడుతుంది అని భవీనా తెలిపింది. ఆ ఏకాగ్రతతోనే ఆమె పారాలింపిక్స్‌లో చైనీస్ ప్లేయర్స్‌ను కూడా ఓడించగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

